హాంకాంగ్ సిక్సస్ టోర్నీలో టీమిండియా ఓటముల పరంపర కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై ఓటమి చవిచూసిన భారత జట్టు.. తాజాగా యూఏఈతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు.
భారత స్టార్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విరోచిత పోరాటం చేసినప్పటకి తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 32 పరుగులు అవసరమవ్వగా.. స్టువర్ట్ బిన్నీ వరుసగా 4, వైడ్, 6, 6, 6, 6, 1 బాదాడు. చివరి బంతికి బిన్నీ అనుహ్యంగా రనౌట్ కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
దీంతో 131 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 129 పరుగుల వద్ద అగిపోయింది. భారత బ్యాటర్లలో స్టువర్ట్ బిన్నీ(11 బంతుల్లో 44, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో పాటు కెప్టెన్ రాబిన్ ఉతప్ప (10 బంతుల్లో 43) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
యూఏఈ ఇన్నింగ్స్‌లో ఖలీద్ షా(42), జహూర్ ఖాన్(37)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. భరత్ చిప్లి, షెహ్‌బాజ్ నదీమ్‌కు చెరో వికెట్ దక్కింది. కాగా ఏడేళ్ల తర్వాత మళ్లీ మొదలైన ఈ హాంకాంగ్ క్రికెట్ సిక్సస్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతీ జట్టులో కేవలం ఆరుగురు ప్లేయర్లే మాత్రమే ఉంటారు.
India needed 32 in 6 balls:
Stuart Binny - 4,WD,6,6,6,6,1. India lost by just 1 run. 💔 pic.twitter.com/qyhKWWyqe6— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2024
Comments
Please login to add a commentAdd a comment