
Robin Uthappa picks Team Indias best XI: టీ20 ప్రపంచకప్- 2021లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన టీమిండియా.. ఇప్పుడు స్వదేశంలో న్యూజిలాండ్‌ను ఢీకొనబోతున్నది. దీనిలో భాగంగా నవంబర్17 న తొలి టీ20 మ్యాచ్ బారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో కివీస్‌తో తలపడే టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఎంచుకున్నాడు. తన జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మూడో స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు, నాలుగో స్ధానంలో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు ఇచ్చాడు.
ఐదో స్ధానంలో సూర్యకూమార్ యాదవ్‌కు అవకాశం ఇచ్చాడు. ఆరో స్ధానంతో పాటు,వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంచుకున్నాడు. ఇక స్పిన్నర్ల కోటాలో రవి ఆశ్విన్‌కు, యుజ్వేంద్ర చాహల్‌కు చోటు ఇచ్చాడు. జట్టులో ఫాస్ట్ బౌలర్లగా భువనేశ్వర్ కూమార్, హర్షల్ పటేల్, మొహ్మద్ సిరాజ్‌ను ఊతప్ప ఎంపిక చేశాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు ఊతప్ప ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.
ఊతప్ప ప్లేయింగ్ ఎలెవన్ జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవి అశ్విన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్