
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై 182 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న రోహిత్ శర్మ గ్యాంగ్.. ఆపై బౌలింగ్‌లో కూడా మెరిసింది. దాంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇది కేకేఆర్‌కు ఐదో ఓటమి కాగా, ముంబైకు నాల్గో విజయం.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ ఓపెనర్లు క్రిస్ లిన్(17), శుభ్‌మాన్ గిల్(7) నిరాశపరిచారు. ఆపై రాబిన్ ఉతప్ప(54), నితీష్ రాణా(31), దినేశ్ కార్తీక్(36 నాటౌట్)లు తమ వంతు ప్రయత్నం చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు సాధించగా, కృనాల్ పాండ్యా,బూమ్రా, మెక్లాన్‌గన్, మార్కండేలకు తలో వికెట్ దక్కింది.
అంతకముందు ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఓపెనర్లు శుభారంభం అందించారు. సూర్యకుమార్ యాదవ్(59; 39బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి మెరవడంతో పాటు ఎవిన్ లూయిస్(43; 23బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుతంగా ఆడాడు. తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత లూయిస్ ను రస్సెల్ ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్(11) నిరుత్సాహపరిచాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్‌తో కలిసి మరో ఓపెనర్ సూర్యకుమార్ ఇన్నింగ్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాగా, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రస్సెల్ విడదీశాడు. సూర్యకుమార్‌ను ఔట్ చేసి కేకేఆర్‌కు మరో బ్రేక్ ఇచ్చాడు. స్కోరును పెంచే క్రమంలో కృనాల్ పాండ్యా(14) వెనుదిరిగాడు. దాంతో ముంబై స్కోరు బోర్డు నెమ్మదించింది. కాగా, చివర్లో హార్దిక్ పాండ్యా(35 నాటౌట్; 20 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్), డుమినీ(13నాటౌట్)లు సమయోచితంగా ఆడటంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment