Sachin Tendulkar, Ravi Shastri, Virender Sehwag Hail Nadal's Historic French Open Win - Sakshi
Sakshi News home page

Rafael Nadal: ‘సెల్యూట్‌ ఫరెవర్‌’.. నాదల్‌పై సచిన్‌, సెహ్వాగ్‌ ప్రశంసలు

Published Mon, Jun 6 2022 9:20 AM | Last Updated on Mon, Jun 6 2022 10:33 AM

Rafael Nadal: Salute Forever Tendulkar Ravi Shastri Sehwag Praises 14th Title - Sakshi

టెన్నిస్‌ దిగ్గజం, స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌పై భారత మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా పద్నాలుగవసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన ‘మట్టి కోర్టు మహారాజు’కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌.. ‘‘36 ఏళ్ల వయసులో ఫ్రెంచ్‌ఓపెన్‌లో రికార్డు స్థాయిలో 14వ టైటిల్‌.. 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలవడం నిజంగా అద్భుతం.. అసాధారణ విజయం. కంగ్రాట్స్‌ నాదల్‌’’ అంటూ ట్విటర్‌ వేదికగా విష్‌ చేశారు.

ఇక భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం.. ‘‘మట్టి కోర్టు రాజు.. గొప్ప ఆటగాడు.. చాంపియన్‌.. నాదల్‌.. ఫ్రెంచ్‌ఓపెన్‌లో 14వ టైటిల్‌’’ అంటూ నాదల్‌ ఫొటోను ట్వీట్‌ చేస్తూ అతడికి అభినందనలు తెలిపాడు. అదే విధంగా ప్రజ్ఞాన్‌ ఓజా, టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, రాబిన్‌ ఊతప్ప ట్విటర్‌ వేదికగా నాదల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నాదల్‌ను గ్రీక్‌ గాడ్‌ హెర్క్యులస్‌తో పోల్చిన రవిశాస్త్రి.. ఎర్రమట్టి కోర్టులో అతడు 15వ టైటిల్‌ కూడా గెలవాలని ఆకాంక్షించాడు. సెల్యూట్‌ ఫరెవర్‌ అంటూ అతడిని ఆకాశానికెత్తాడు. 

కాగా ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌-2022 పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో నాదల్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి కాస్పర్‌ రూడ్‌ (నార్వే)ను 6–3, 6–3, 6–0తో ఓడించాడు. తద్వారా తద్వారా ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను 14వసారి గెలిచిన నాదల్‌.. తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మట్టి కోర్టుకు తాను మకుటం లేని మహారాజునని మరోసారి నిరూపించుకుని కితాబులు అందుకుంటున్నాడు.

చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్‌.. పలు అరుదైన రికార్డులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement