భార్యాబిడ్డలతో రాబిన్ ఊతప్ప(PC: Robin Uthappa Instagram)
టీమిండియా వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప రెండోసారి తండ్రయ్యాడు. ఊతప్ప దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని ఊతప్ప సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భార్యా, బిడ్డలతో ఉన్న ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశాడు.
‘‘మా జీవితాల్లో అడుగుపెట్టిన చిన్నారి దేవతను మీకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ట్రినిటి థియా ఊతప్ప.. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు.. నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చే అవకాశం ఇచ్చినందుకు నీకు రుణపడి ఉంటాం.
నీకు తల్లిదండ్రులమైనందుకు మేము.. అన్నయ్య అయినందుకు నీ సోదరుడు.. దీనిని మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాం’’ అని ఊతప్ప ఉద్వేగపూరిత నోట్ రాసుకొచ్చాడు. కాగా కేరళకు చెందిన రాబిన్ వేణు ఊతప్ప వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎదిగాడు.
2006లో భారత్ తరఫున అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టీ20 ఫార్మాట్‌లోనూ అరంగేట్రం చేశాడు. ఊతప్ప చివరిసారిగా జింబాబ్వేతో వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఇక ఊతప్ప వ్యక్తిగత విషయానికొస్తే.. 2016లో శీతల్‌ను పెళ్లాడాడు. వీరికి ఇప్పటికే కుమారుడు నీల్ నోలన్ ఊతప్ప ఉన్నాడు. తాజాగా కుమార్తె జన్మించింది. కాగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే ఊతప్ప ఎప్పటికప్పుడు తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.
చదవండి: Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే!
Comments
Please login to add a commentAdd a comment