Robin Uthappa Viral Video In IPL 2021: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది జరిగిన అనంతరం సీఎస్‌కే 12వ ఆటగాడు రాబిన్ ఊతప్ప చేసిన ఓ పనికి యావత్ క్రీడా ప్రపంచం సలాం అంటుంది.
💛#WhistlePodu#csk pic.twitter.com/fPHWTP1yCZ— Chakri Dhoni (@ChakriDhoni17) September 25, 2021
సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చిన అనంతరం కెప్టెన్ ధోని(11 నాటౌట్), సురేశ్ రైనా(17 నాటౌట్)లు పెవిలియన్‌కు వస్తుండగా ఊతప్ప ఎదురు వెళ్లి వారి బ్యాట్లను, హెల్మెట్లను డ్రెస్సింగ్ రూంకు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. దీంతో "నువ్వు సూపరప్పా ఊతప్ప" అసలు సిసలైన క్రీడాస్పూర్తిని చూపావంటూ.. నెటిజన్లు ఉతప్పపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సీఎస్‌కేనే విజయం సాధించింది. ముంబై వేదికగా జరిగిన తొలి అంచె పోటీలో సీఎస్‌కే 69 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. కాగా, యువ బ్యాట్స్‌మెన్లు జట్టులో ఉండడంతో ప్రస్తుత సీజన్‌లో ఊతప్పకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. ఈ సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్‌కేకు వచ్చిన రాబీ.. తన ఐపీఎల్ కెరీర్‌లో వివిధ జట్ల(అధికంగా కేకేఆర్) తరఫున 189 మ్యాచ్‌లు ఆడి 4607 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేకేఆర్‌ను రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలపడంలో ఊతప్ప కీలకంగా వ్యవహరించాడు.
చదవండి: అరుదైన 600 వికెట్ల క్లబ్‌లో చేరిన టీమిండియా పేసర్
Comments
Please login to add a commentAdd a comment