Photo: Screenshots From Virat Kohli Twitter
Virat Kohli tears it up in the RCB nets: రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. దుబాయ్ వేదికగా బుధవారం జరిగే మ్యాచ్ కోసం కావాల్సినంత ప్రాక్టీసు చేశారు. ఇక గత రెండు మ్యాచ్‌లలోనూ అర్ధ శతకాలతో ఆకట్టుకున్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం.. నెట్స్‌లో బాగానే శ్రమించాడు. షాట్లతో అలరించాడు. ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోను అతడు ట్విటర్‌లో షేర్ చేశాడు.
ఇక ఇందుకు స్పందనగా.. ‘‘అర్ధ సెంచరీలు ఓకే. ఏదేమైనా సరే.. ఈరోజు సెంచరీ కొడితే చూడాలని ఉంది భాయ్. ఆల్ ది బెస్ట్’’ అని అభిమానులు కోహ్లికి విషెస్ చెబుతున్నారు. మరోవైపు.. ‘‘థాంక్స్... క్రికెట్ ఆడుతున్నావన్న ఎమోజీతోనైనా మాకు అసలు విషయం తెలియజేశావు. లేదంటే.. క్యారమ్స్ ఆడుతున్నావేమోనని భ్రమపడేవాళ్లం’’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. కాగా ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో కోహ్లి 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగులతో రాణించిన కోహ్లి.. ఆదివారం ముంబైతో జరిగిన గేమ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసి బ్యాట్‌తోనే విమర్శలకు సమాధానమిచ్చాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి.. ఆరింటిలో గెలిచిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. నేడు రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
చదవండి: MI Vs PBKS: ముంబైని గెలిపించిన హార్ధిక్.. హ్యాట్రిక్ ఓటములకు బ్రేక్
— Virat Kohli (@imVkohli) September 28, 2021
Comments
Please login to add a commentAdd a comment