'లోపాలను అధిగమించా..అసలైన క్రికెట్ ఆడుతున్నా'
టెక్నిక్ ను మెరుగుపరుచుకున్న తర్వాత అసలైన క్రికెట్ ఆడుతున్నానని రాబిన్ ఊతప్ప అన్నాడు.
దుబాయ్: బ్యాటింగ్ టెక్నిక్ ను మెరుగుపరుచుకున్న తర్వాత అసలైన క్రికెట్ ఆడుతున్నానని రాబిన్ ఊతప్ప అన్నాడు. తన బ్యాటింగ్ లోని లోపాలను సరిదిద్దుకున్నానని.. దాంతో క్రికెట్ ను పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నానని ఉతప్ప తెలిపారు. తన బ్యాటింగ్ మెరుగుపడిందని చెప్పడానికి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ ఓ ఉదాహరణ అని ఉతప్ప అన్నాడు. శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఉతప్ప 41 బంతుల్లో 55 పరుగులు చేసినా ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయాన్ని అడ్డుకోలేకపోయిన సంగతి తెలిసిందే.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ పూర్తి భాగం తమ ఆధీనంలో ఉందని.. అయితే 18 ఓవర్ లో ఆట తీరునే మార్చి వేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడని డ్యూమినీకి కితాబిచ్చాడు. మనీష్ పాండే, షాకిబ్ ఆల్ హసన్, వినయ్ కుమార్ మెరుగైన ఆటతీరును ప్రదర్శించారన్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఓటమి చెందడం వెనుక లోపాలను సరిదిద్దుకుంటామని ఉతప్ప తెలిపాడు.