సౌత్‌జోన్ 236/9 | Robin Uthappa century in the Duleep Trophy semi-final | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్ 236/9

Published Thu, Oct 23 2014 12:36 AM | Last Updated on Sat, Sep 29 2018 5:44 PM

సౌత్‌జోన్ 236/9 - Sakshi

సౌత్‌జోన్ 236/9

రాబిన్ ఉతప్ప సెంచరీ  దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్
 
రోహ్‌టక్: రాబిన్ ఉతప్ప (196 బంతుల్లో 120; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించడం మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సౌత్‌జోన్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. ఈస్ట్‌జోన్‌తో బుధవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 86.5 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (32) ఫర్వాలేదనిపించాడు. రెండో వికెట్‌కు ఉతప్ప, నాయర్ 94 పరుగులు జత చేశారు. ఈస్ట్ బౌలర్లలో లక్ష్మీ రతన్ శుక్లా (4/30) రాణించగా, దిండా, రాణా దత్తా చెరో 2 వికెట్లు పడగొట్టారు.

నమన్ ఓజా, సక్సేనా శతకాలు

 మొహాలి: నార్త్‌జోన్‌తో జరుగుతున్న మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 344 పరుగుల భారీ స్కోరు చేసింది. నమన్ ఓజా (193 బంతుల్లో 122 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), జలజ్ సక్సేనా (187 బంతుల్లో 110; 17 ఫోర్లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 140 పరుగులు జోడించడం విశేషం. అనంతరం అశోక్ మేనరియా (93 బంతుల్లో 53 బ్యాటింగ్; 6 ఫోర్లు)తో నాలుగో వికెట్‌కు ఓజా అభేద్యంగా 107 పరుగులు జత చేశాడు. లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement