East Zone
-
Riyan Parag: ఓవరాక్షన్ ప్లేయర్ అన్న నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు..!
ఆన్ ఫీల్డ్ బిహేవియర్ కారణంగా ఓవరాక్షన్ ప్లేయర్‌గా ముద్ర వేసుకున్న టీమిండియా యువ ఆటగాడు రియాన్ పరాగ్.. తనను తిట్టిన నోళ్లతోనే పొగిడించుకుంటున్నాడు. ఆట కంటే అతి ఎక్కువగా చేసి బాగా పాపులరైన రియాన్.. తాజాగా ముగిసిన దియోదర్ ట్రోఫీ-2023లో బ్యాట్‌తో బంతితో చెలరేగి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. దియోదర్ ట్రోఫీలో 5 మ్యాచ్‌లు ఆడిన రియాన్.. 2 సెంచరీలు, అర్ధసెంచరీ సాయంతో 88.50 సగటున 354 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన రియాన్.. బంతితోనూ మెరిశాడు. 19.09 సగటున 11 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన రియాన్.. ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. తన జట్టు (ఈస్ట్ జోన్) కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన రియాన్.. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. సౌత్ జోన్‌తో నిన్న (ఆగస్ట్ 3) జరిగిన ఫైనల్లోనూ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న 21 ఏళ్ల రియాన్.. తన జట్టును గెలిపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. తొలుత బంతితో (2/68) మ్యాజిక్ చేసిన రియాన్.. ఆ తర్వాత బ్యాట్‌తో చెలరేగి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 65 బంతులు ఎదుర్కొన్న రియాన్.. 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో కుమార్ కుషాగ్రాతో (68) కలిసి కీలక భాగాస్వామ్యం నెలకొల్పిన రియాన్.. ఆరో వికెట్‌గా వెనుదిరగడంతో ఈస్ట్ జోన్ ఓటమి ఖరారైంది. కాగా, దియోదర్ ట్రోఫీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్.. రోహన్ కున్నుమ్మల్ (107), మయాంక్ అగర్వాల్ (63) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఈస్ట్ జోన్.. 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో రియాన్ పరాగ్, కుషాగ్రా మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. దియోదర్ ట్రోఫీ-2023లో రియాన్ పరాగ్ స్కోర్లు, వికెట్లు.. నార్త్ ఈస్ట్ జోన్‌పై 13 పరుగులు, 4 వికెట్లు నార్త్ జోన్‌పై 131 పరుగులు, 4 వికెట్లు సౌత్ జోన్‌పై 13 పరుగులు, ఒక వికెట్ వెస్ట్ జోన్‌పై 102 నాటౌట్ ఫైనల్లో సౌత్ జోన్‌పై 95 పరుగులు, 2 వికెట్లు -
రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్‌జోన్
దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్‌జోన్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్‌జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. మయాంక్ (63; 4 ఫోర్లు), జగదీశన్ (54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్‌జోన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 𝗦𝗢𝗨𝗧𝗛 𝗭𝗢𝗡𝗘 are WINNERS of the #DeodharTrophy 2023-24! 🙌 Congratulations to the @mayankcricket-led unit 👏👏 East Zone fought hard in a high-scoring battle here in Puducherry 👌👌 Scorecard - https://t.co/afLGJxp77b#Final | #SZvEZ pic.twitter.com/x6PEjFp5Pr — BCCI Domestic (@BCCIdomestic) August 3, 2023 చదవండి: IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా -
సిక్సర్ల వర్షం.. సెంచరీతో పాటు 4 వికెట్లు! రియాన్ పరాగ్ విధ్వంసం.. నిజమేనా?
Deodhar Trophy 2023- North Zone vs East Zone: దియోధర్ ట్రోఫీ-2023లో ఈస్ట్ జోన్ బ్యాటర్ రియాన్ పరాగ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. తన విలువైన ఇన్నింగ్స్‌లో జట్టును గెలిపించాడు. కాగా పుదుచ్చేరి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో నార్త్ జోన్- ఈస్ట్ జోన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ శుభారంభం అందుకోలేకపోయింది. టాపార్డర్‌లో మొత్తం పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(10), ఉత్కర్ష్ సింగ్(11) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ సింగ్ కేవలం 2 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ సిక్సర్ల వర్షం ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సుభ్రాంషు సేనాపతి (13), కెప్టెన్ సౌరభ్ తివారి(16) సైతం నిరాశపరిచారు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన రియాన్ పరాగ్ ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డాడు. వికెట్ కీపర్ బ్యాటర్ కుశర్గ(98)తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అద్భుత సెంచరీ 102 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఈస్ట్ జోన్ 8 వికెట్ల నష్టపోయి ఏకంగా 337 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన నార్త్ జోన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను రియాన్ పరాగ్ కకావికలం చేశాడు. నాలుగు వికెట్లు తీసి 10 ఓవర్ల బౌలింగ్‌లో 57 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ఉత్కర్ష్, ఆకాశ్ దీప్, ముఖ్తార్ హుసేన్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 45.3 ఓవర్లలోనే నార్త్ జోన్ కథ ముగిసింది. 249 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ కావడంతో.. 88 పరుగులతో ఈస్ట్‌జోన్ జయభేరి మోగించింది. అస్సలు ఊహించలేదు.. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ ప్రదర్శనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రియాన్ పరాగ్ ఇప్పటికైనా నువ్వున్నావని గుర్తించేలా చేశావు... అది కూడా ఆటతో! అస్సలు ఊహించలేదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అసోం కుర్రాడు.. ఆట కంటే తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఓవరాక్షన్ ప్లేయర్‌గా ముద్రపడి విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజా సీజన్లో 7 ఇన్నింగ్స్ ఆడి 78 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రియాన్ దియోదర్ ట్రోఫీ ప్రదర్శనపై నెటిజన్లు ఈ మేరకు కామెంట్లు చేయడం గమనార్హం. చదవండి: టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. -
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి.. నయా స్వరూపం ఇలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచి్చంది. నగరంలో కొత్తగా రెండు జోన్లు, 10 డివిజన్లు, 13 ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జోన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు, డివిజన్లు 17 నుంచి 27కు, ఠాణాలు 60 నుంచి 73కు చేరనున్నాయి. ఈ మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లు మాయమవుతుండగా.. ఠాణాల పరిధులు మారుతున్నాయి. పక్షం రోజుల్లో వీటికి సంబంధించిన కార్యాలయాల ఎంపిక పూర్తి చేయాలని, కొత్త ఏడాది నుంచి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పోలీసు విభాగానికి 3,966 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నుంచి సిటీకి మూడు డీసీపీ, 12 ఏసీపీ, 26 ఇన్స్పెక్టర్ సహా 1,252 పోస్టులు వచ్చాయి. గతేడాది డిసెంబర్లో నగర కొత్వాల్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగానే పునర్ వ్యవస్థీకరణపైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి పని ప్రారంభించేందుకు సీపీ ఆనంద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈస్ట్ జోన్: ప్రస్తుతం సుల్తాన్‌బజార్, కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు.. సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్‌పేట, సైదాబాద్, అంబర్పేట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో నార్త్‌జోన్, సెంట్రల్ జోన్లలోని కొన్ని ఠాణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు మాయమై అంబర్‌పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు తో కొత్తవి వస్తున్నాయి. వారాసిగూడ పేరుతో కొత్త ఠాణా, చిలకలగూడ, లాలాగూడ, నారాయణగూడ ఠాణాలు ఈ జోన్లోకి వస్తున్నాయి. నార్త్‌జోన్: ఇందులో గోపాలపురం, మహంకాళి, బేగంపేట సబ్–డివిజన్లు, గోపాలపురం, తుకారాంగేట్, లాలాగూడ, చిలకలగూడ, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో తిరుమలగిరి కేంద్రంగా డివిజన్ ఏర్పడుతోంది. తాడ్‌బన్‌లో కొత్త ఠాణాతో పాటు మధ్య మండల నుంచి రామ్‌గోపాల్‌పేట ఈ జోన్లోకే వస్తోంది. సౌత్ జోన్: ప్రస్తుతం చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ డివిజన్లు, చార్మినార్, బహదూర్‌పుర, కామాటిపుర, హుస్సేనిఆలం, కాలాపత్తర్, మీర్‌చౌక్, డబీర్‌పుర, మొఘల్‌పుర, రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, కంచన్‌బాగ్, భవానీనగర్, మాదన్నపేట, సంతోష్‌నగర్ ఠాణాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జోన్లో ఉండే ఫలక్‌నుమా డివిజన్ మాయమవుతోంది. దాని స్థానంలో బహదూర్‌పుర వస్తుండగా.. పోలీసుస్టేషన్ల 11కు తగ్గుతున్నాయి. వెస్ట్ జోన్: ప్రస్తుతం పంజగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్ డివిజన్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, లంగర్‌హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, షాహినాయత్‌గంజ్, హబీబ్‌నగర్, కుల్సుంపుర, మంగళ్‌హాట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో ఆసిఫ్‌నగర్ డివిజన్ ఈ జోన్ నుంచి మాయమవుతోంది. దీని స్థానంలో జూబ్లీహిల్స్ పేరుతో కొత్తది వస్తోంది. మాసబ్‌ట్యాంక్, రెహ్మత్‌నగర్, ఫిలింనగర్, బోరబండల్లో కొత్త ఠాణాలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ జోన్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్ ఠాణాలు మాత్రమే ఉంటాయి సౌత్ ఈస్ట్ జోన్: కమిషనరేట్‌లో ఆరో జోన్‌గా సౌత్ ఈస్ట్ ఏర్పడుతోంది. ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే చాంద్రాయణగుట్ట, సైదాబాద్ సబ్–డివిజన్లతో పాటు ఈస్ట్ నుంచి వచ్చే మలక్‌పేట, సౌత్ నుంచి వచ్చే సంతోష్‌నగర్ డివిజన్లు ఉండనున్నాయి. ఆ రెండు జోన్ల నుంచి వేరయ్యే చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, మాదన్నపేట, సైదాబాద్, రెయిన్‌బజార్, భవానీనగర్, సంతోష్నగర్లతో పాటు కొత్తగా బండ్లగూడ, ఐఎస్ సదన్ ఠాణాలు ఈ కొత్త జోన్లో ఉంటాయి. సౌత్ వెస్ట్ జోన్: ఏడో జోన్‌గా పరిగణించే సౌత్ వెస్ట్ మరో కొత్త జోన్‌గా అవతరిస్తోంది. ఇందులో వెస్ట్, సెంట్రల్ జోన్ల నుంచి వేరైన ఆసిఫ్‌నగర్, బేగంబజార్‌తో పాటు కొత్తగా గోల్కొండ, కుల్సుంపుర డివిజన్లు వచ్చి చేరుతున్నాయి. ఆ రెండు జోన్ల నుంచే విభజించిన ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, బేగంబజార్, షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్, గోల్కొండ, లంగర్‌హౌస్, కుల్సుంపుర, టప్పాచబుత్ర ఠాణాలతో పాటు కొత్తగా టోలిచౌకి, గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్లు రానున్నాయి. సెంట్రల్ జోన్: ప్రస్తుతం ఈ జోన్లో అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ డివిజన్లు.. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్, గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట, సైఫాబాద్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. తాజా మార్పు చేర్పులతో గాం«దీనగర్ డివిజన్‌గా ఏర్పడుతోంది. దోమలగూడ, లేక్ పోలీసు, ఖైరతాబాద్‌ల్లో కొత్త ఠాణాలు ఏర్పాడుతున్నాయి. నారాయణగూడ, బేగంబజార్, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట్ ఠాణాలు ఈ జోన్లో ఉండవు. -
గతంలో భరత్‌పై కేసు పెట్టలేదు : ఈస్ట్ జోన్ డీసీపీ
సాక్షి, హైదరాబాద్ : బర్కత్‌పురాలో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది భరత్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొబ్బరి బోండాలకు వాడే కత్తితో నిందితుడు అమ్మాయిపై దాడి చేసి.. విచక్షణారహితంగా నరికాడని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని యశోదా ఆస్పత్రికి తరలించామని.. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని పేర్కొన్నారు. (ప్రేమోన్మాది భరత్ అరెస్టు) అప్పుడు కేసు మాత్రం పెట్టలేదు.. నిందితుడు భరత్‌ను పట్టుకునేందుకు పోలీసులు మూడు టీములగా విడిపోయి వెదికినట్లు డీసీపీ తెలిపారు. అతడిని మూసీ నది సమీపంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధితురాలు- నిందితుడు ఒకే కాలనీలో ఉంటున్నారని పేర్కొన్నారు. అమ్మాయి ఇంటికి సమీపంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. గతంలో తమ కూతురిని వేధిస్తున్నాడని బాధితురాలి కుటుంబ సభ్యులు భరోసా సెంటర్‌ను ఆశ్రయించారన్నారు. అయితే కేసు మాత్రం పెట్టలేదని వెల్లడించారు. ప్రస్తుతం భరత్ తమ కస్టడీలోనే ఉన్నాడని.. దాడి చేయడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. (హైదరాబాద్ బర్కత్‌పురాలో ఘోరం) -
సెమీస్‌లో సౌత్‌జోన్, ఈస్ట్ జోన్
ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారుు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన టీమ్ చాంపియన్‌షిప్ తొలి క్వార్టర్స్ ఫైనల్లో సౌత్‌జోన్ జట్టు... వెస్ట్ జోన్ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్ మ్యాచ్‌లో సిద్ధార్థ్ ఠాకూర్ 21-8, 21-8తో లిఖిత్‌పై గెలుపొందాడు. డబుల్స్ మ్యాచ్‌లో సిద్ధార్థ్- సృజన్ జోడీ 21-15, 21-10తో లిఖిత్- సుశ్రుత్ జంటపై విజయం సాధించింది. రెండో క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు... నార్త్ ఈస్ట్ జట్టును ఓడించి సెమీస్‌కు చేరుకుంది. మహిళల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నార్త్‌జోన్ జట్టు... ఈస్ట్ జోన్‌పై గెలుపొందింది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో బుధవారం జరిగిన పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌లో నార్త్ఈస్ట్, వెస్ట్‌జోన్ జట్లు... మహిళల విభాగంలో ఈస్ట్‌జోన్, హెడ్‌క్వార్టర్ జట్లు గెలుపొందాయి. ఈ పోటీలను ఎఫ్‌సీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఒ.పి. డాని ప్రారంభించారు. -
కుక్కకు భయపడి...
► భవనంపై నుంచి దూకిన ముగ్గురు కూలీలు ► ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు ► ఏపీ మంత్రి అయ్యన్న వియ్యంకుడి ఇంట్లో ఘటన ద్వారకానగర్ (విశాఖ): ఓ పెంపుడు కుక్క రెండు నిండు ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి వియ్యంకుడు, ఉత్తరాంధ్ర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు ఏపీలోని విశాఖలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిలో గురువారం ఈ దారుణం జరిగింది. నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అక్కయ్యపాలెం లలితానగర్‌లో రాంబాబు మూడంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అక్కయ్యపాలెం చెన్నూరు మసీద్ సెంటర్‌కు చెందిన నాచి గోపి(27), ఎమ్డీ హుస్సేన్ వలీ(44), విజయనగరం జిల్లా కోనాడ గ్రామానికి చెందిన బొండా శ్రీనులు పది రోజులుగా అందులో ఇంటీరియర్ పనులు చేస్తున్నారు. రోజూ మాదిరిగానే గురువారం వచ్చి పనులు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాంబాబు ఇంటిలో ఉన్న జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూసి కింద పని చేస్తున్న కూలీలు భయపడి, కుక్కా కుక్కా అని అరుస్తూ రెండో అంతస్తులోకి పరిగెత్తారు. ఈ అరుపులు విని అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కూలీలు భయంతో కిందికి దూకేశారు. తీవ్ర గాయాలతో గోపీ అక్కడికక్కడే మరణించాడు. హుస్సేన్ వలీ, శ్రీనులను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హుస్సేన్ చనిపోయాడు. తీవ్ర గాయాలతో శ్రీను చికిత్స పొందుతున్నాడు. ఈస్ట్ జోన్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. నాలుగో పట్టణ ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబు పెంచుకుంటున్న ఈ కుక్క కొద్ది రోజుల క్రితం ఓ మేస్త్రిని కరిచినట్లు క్షతగాత్రుడు శ్రీను వెల్లడించాడు. అప్పటి నుంచి ఇంటిలో పని జరుగుతున్నంతసేపూ కుక్కను గొలుసులతో కట్టి ఉంచుతున్నారు. ఆ గొలుసు తెగిపోవడంతో కుక్క బయటకు వచ్చింది. అకస్మాత్తుగా దాన్ని చూసిన కూ లీలు కిందకు దూకేశారు. -
నిఘా నీడలో ఈస్ట్‌జోన్
ముఖ్యమైన జంక్షన్లు, పార్కులు, ఆలయాల వద్ద నిఘానేత్రం 753 కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదన ఇప్పటికే 531 బిగింపు తగ్గిన స్నాచింగ్‌లు-పెరిగిన రికవరీలు సిటీబ్యూరో: లండన్ తరహా సీసీ కెమెరా వ్యవస్థను నగరంలో ఏర్పాటు చేస్తామని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నట్లుగానే ఈస్ట్ జోన్ పోలీసులు అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ పరిధిలోని తొమ్మిది పోలీసుస్టేషన్ల పరిధిలో ముఖ్యమైన పార్కులు, జంక్షన్లు, ఆలయాలు, షాపింగ్ సెంటర్ల వద్ద ఏర్పాటు చేయనున్న కెమెరాల నివేదికను డీసీపీ రవీందర్‌కు ఆయా స్టేషన్ల ఇన్స్పెక్టర్లు సోమవారం అందజేశారు. ఇక జోన్ పరిధిలో ఏ చిన్న నేరం జరిగినా నిందితులను క్షణాల్లో గుర్తించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జోన్ పరిధిలో మొత్తం 753 కెమెరాలు ఏర్పాటు చేయడానికి రెండు నెలల క్రితమే ప్రతిపాదనలు తయారయ్యాయి. నిన్నటి వరకు 531 కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిని జనవరి మొదటి వారంలోపు పూర్తి చేయాలని డీసీపీ ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటులో సుల్తాన్‌బజార్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో నల్లకుంట ఉంది. ఈ రెండు ప్రాంతాలు అత్యంత కీలకమైనవి కావడంతో ఎక్కువ కెమెరాలు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా స్నాచింగ్‌లు తగ్గుముఖం పడతాయని అధికారుల అంచనా. ఈ ఏడాది తగ్గిన స్నాచింగ్ కేసులు మూడేళ్ల స్నాచింగ్ గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది 25 శాతం వరకు తగ్గాయి. మూడేళ్లలో మొత్తం 536 స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 302 కేసులు పరిష్కారమయ్యాయి. అంతేకాకుండా రికవరీల శాతం కూడా ఈ ఏడాది పెరిగింది. మలక్‌పేట డివిజన్ పరిధిలోనే ఎక్కువ స్నాచింగ్‌లు జరిగాయి. నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే... నేరం చేయాలంటే దడ పుట్టేలా జోన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు ఉంటుంది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీలో భాగంగా సీసీ కెమెరాలకు అత్యధిక ప్రాధానం కల్పించాం. స్కూళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ సెంటర్ల యాజమాన్యాలు సహకారం ఉంటేనే ఈ ప్రయోగం విజయవంతమవుతుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - డీసీపీ రవీందర్ -
సౌత్‌జోన్ 236/9
రాబిన్ ఉతప్ప సెంచరీ దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్ రోహ్టక్: రాబిన్ ఉతప్ప (196 బంతుల్లో 120; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించడం మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సౌత్‌జోన్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. ఈస్ట్‌జోన్‌తో బుధవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 86.5 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (32) ఫర్వాలేదనిపించాడు. రెండో వికెట్‌కు ఉతప్ప, నాయర్ 94 పరుగులు జత చేశారు. ఈస్ట్ బౌలర్లలో లక్ష్మీ రతన్ శుక్లా (4/30) రాణించగా, దిండా, రాణా దత్తా చెరో 2 వికెట్లు పడగొట్టారు. నమన్ ఓజా, సక్సేనా శతకాలు మొహాలి: నార్త్‌జోన్‌తో జరుగుతున్న మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 344 పరుగుల భారీ స్కోరు చేసింది. నమన్ ఓజా (193 బంతుల్లో 122 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), జలజ్ సక్సేనా (187 బంతుల్లో 110; 17 ఫోర్లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 140 పరుగులు జోడించడం విశేషం. అనంతరం అశోక్ మేనరియా (93 బంతుల్లో 53 బ్యాటింగ్; 6 ఫోర్లు)తో నాలుగో వికెట్‌కు ఓజా అభేద్యంగా 107 పరుగులు జత చేశాడు. లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు.