సాక్షి, హైదరాబాద్ : బర్కత్‌పురాలో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది భరత్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొబ్బరి బోండాలకు వాడే కత్తితో నిందితుడు అమ్మాయిపై దాడి చేసి.. విచక్షణారహితంగా నరికాడని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని యశోదా ఆస్పత్రికి తరలించామని.. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని పేర్కొన్నారు. (ప్రేమోన్మాది భరత్ అరెస్టు)
అప్పుడు కేసు మాత్రం పెట్టలేదు..
నిందితుడు భరత్‌ను పట్టుకునేందుకు పోలీసులు మూడు టీములగా విడిపోయి వెదికినట్లు డీసీపీ తెలిపారు. అతడిని మూసీ నది సమీపంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధితురాలు- నిందితుడు ఒకే కాలనీలో ఉంటున్నారని పేర్కొన్నారు. అమ్మాయి ఇంటికి సమీపంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. గతంలో తమ కూతురిని వేధిస్తున్నాడని బాధితురాలి కుటుంబ సభ్యులు భరోసా సెంటర్‌ను ఆశ్రయించారన్నారు. అయితే కేసు మాత్రం పెట్టలేదని వెల్లడించారు. ప్రస్తుతం భరత్ తమ కస్టడీలోనే ఉన్నాడని.. దాడి చేయడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. (హైదరాబాద్ బర్కత్‌పురాలో ఘోరం)
Comments
Please login to add a commentAdd a comment