barkathpura
-
గతంలో భరత్‌పై కేసు పెట్టలేదు : ఈస్ట్ జోన్ డీసీపీ
సాక్షి, హైదరాబాద్ : బర్కత్‌పురాలో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది భరత్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొబ్బరి బోండాలకు వాడే కత్తితో నిందితుడు అమ్మాయిపై దాడి చేసి.. విచక్షణారహితంగా నరికాడని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని యశోదా ఆస్పత్రికి తరలించామని.. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని పేర్కొన్నారు. (ప్రేమోన్మాది భరత్ అరెస్టు) అప్పుడు కేసు మాత్రం పెట్టలేదు.. నిందితుడు భరత్‌ను పట్టుకునేందుకు పోలీసులు మూడు టీములగా విడిపోయి వెదికినట్లు డీసీపీ తెలిపారు. అతడిని మూసీ నది సమీపంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధితురాలు- నిందితుడు ఒకే కాలనీలో ఉంటున్నారని పేర్కొన్నారు. అమ్మాయి ఇంటికి సమీపంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. గతంలో తమ కూతురిని వేధిస్తున్నాడని బాధితురాలి కుటుంబ సభ్యులు భరోసా సెంటర్‌ను ఆశ్రయించారన్నారు. అయితే కేసు మాత్రం పెట్టలేదని వెల్లడించారు. ప్రస్తుతం భరత్ తమ కస్టడీలోనే ఉన్నాడని.. దాడి చేయడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. (హైదరాబాద్ బర్కత్‌పురాలో ఘోరం) -
ప్రేమోన్మాది భరత్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : ప్రేమను అంగీకరించలేదన్న కక్షతో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడిన ప్రేమోన్మాది భరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాచిగూడలో అతడిని అదుపులోకి తీసుకుని దాడికి వినియోగించిన కత్తి, అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం మీడియా ముందు నిందితుడిని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. కాగా బర్కత్‌పురా సత్యానగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలో భరత్ అనే వ్యక్తి తరచూ తనను వేధిస్తున్న విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి వెళ్లింది. దీంతో గతవారం వారిద్దరినీ కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. అయినా, భరత్ తన ధోరణిని మార్చుకోలేదు. రెండు రోజుల కిందట అమ్మాయి తల్లికి కూడా ఫోన్ చేసి బెదిరించాడు. ఈ క్రమంలో బుధవారం భరత్ కిరాతకంగా దాడి చేయడంతో విద్యార్థిని మెడపై, పొట్టపై, చేతివేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
ఇంటర్ విద్యార్ధిని పై ప్రేమోన్మాది దాడి
-
హైదరాబాద్ బర్కత్‌పురాలో ఘోరం
సాక్షి, హైదరాబాద్: ప్రేమను అంగీకరించలేదన్న కక్షతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జరిగింది. బర్కత్‌పురా సత్యానగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని.. ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన భరత్ అనే యువకుడు ప్రేమించాలని ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆమెను అడ్డుకున్న నిందితుడు.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ఒప్పుకోలేదనే ఆగ్రహంతో ఊగిపోయిన భరత్...వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో ఆమె మెడపై వేటు వేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ దారుణాన్ని చూసిన చుట్టపక్కలవారు వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని మలక్ పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా, ఇంటర్ సెకండియర్ చదువుతున్న అమ్మాయి (17) వెంట పడుతూ..తరచూ భరత్ వేధిస్తున్న విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లడంతో గతవారం వారిద్దరినీ కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. అయినా, భరత్ తన ధోరణిని మార్చుకోలేదు. రెండురోజుల కిందట అమ్మాయి తల్లికి ఫోన్ చేసి బెదిరించాడు. అతడు కిరాతకంగా దాడి చేయడంతో మెడపై, పొట్టపై, చేతివేళ్లపై బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. -
హైందవి జోష్..
కాచిగూడ: బర్కత్‌పురలోని హైందవి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకతో హోరెత్తించారు. జూనియర్లకు స్వాగతం పలుకుతూ సీనియర్స్ రాంకోఠిలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో సందడి చేశారు. ఫ్యాషన్ షో, ర్యాంప్‌వాక్, డ్యాన్సులతో అంతా ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో హైందవి విద్యా సంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, డైరెక్టర్ జె.వి. ప్రేమ్‌రాజ్, ఏఓ కొండలరావు, వైస్ ప్రిన్సిపల్ రఫత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో మంటలు
హైదరాబాద్: నగరంలోని బర్కత్ పుర వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను బస్సులో నుంచి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన బర్కత్‌పుర చౌరస్తా వద్ద జరిగింది. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వెళ్తున్న 113 నెంబరు బస్సులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. మంటలకు కారణాలు తెలియరాలేదు.