సాక్షి, హైదరాబాద్ : ప్రేమను అంగీకరించలేదన్న కక్షతో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడిన ప్రేమోన్మాది భరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాచిగూడలో అతడిని అదుపులోకి తీసుకుని దాడికి వినియోగించిన కత్తి, అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం మీడియా ముందు నిందితుడిని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.
కాగా బర్కత్‌పురా సత్యానగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలో భరత్ అనే వ్యక్తి తరచూ తనను వేధిస్తున్న విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి వెళ్లింది. దీంతో గతవారం వారిద్దరినీ కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. అయినా, భరత్ తన ధోరణిని మార్చుకోలేదు. రెండు రోజుల కిందట అమ్మాయి తల్లికి కూడా ఫోన్ చేసి బెదిరించాడు. ఈ క్రమంలో బుధవారం భరత్ కిరాతకంగా దాడి చేయడంతో విద్యార్థిని మెడపై, పొట్టపై, చేతివేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment