సాక్షి, హైదరాబాద్: ప్రేమను అంగీకరించలేదన్న కక్షతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జరిగింది. బర్కత్‌పురా సత్యానగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని.. ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన భరత్ అనే యువకుడు ప్రేమించాలని ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆమెను అడ్డుకున్న నిందితుడు.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ఒప్పుకోలేదనే ఆగ్రహంతో ఊగిపోయిన భరత్...వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో ఆమె మెడపై వేటు వేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ దారుణాన్ని చూసిన చుట్టపక్కలవారు వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని మలక్ పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
కాగా, ఇంటర్ సెకండియర్ చదువుతున్న అమ్మాయి (17) వెంట పడుతూ..తరచూ భరత్ వేధిస్తున్న విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లడంతో గతవారం వారిద్దరినీ కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. అయినా, భరత్ తన ధోరణిని మార్చుకోలేదు. రెండురోజుల కిందట అమ్మాయి తల్లికి ఫోన్ చేసి బెదిరించాడు. అతడు కిరాతకంగా దాడి చేయడంతో మెడపై, పొట్టపై, చేతివేళ్లపై బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment