ఆర్టీసీ బస్సులో మంటలు | fire accident in rtc bus at barkathpura | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో మంటలు

Published Tue, Jul 7 2015 9:24 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in rtc bus at barkathpura

హైదరాబాద్: నగరంలోని బర్కత్ పుర వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను బస్సులో నుంచి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన బర్కత్‌పుర చౌరస్తా వద్ద జరిగింది. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వెళ్తున్న 113 నెంబరు బస్సులో  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. మంటలకు కారణాలు తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement