ధర్పల్లి(నిజామాబాద్ రూరల్): ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగగా డ్రైవర్ చాకచక్యంతో ఆర్పివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్ట్ శివారులోని అటవీ ప్రాంతం వద్ద ధర్పల్లి నుంచి నిజా మాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గురువారం సాయంత్రం బస్సు ఇంజన్ నుంచి ఒక్కసారిగా పొగలు లేచాయి.
ప్రయాణికులు భయాందోళనకు గురై కిందికి దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరికీ స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ వెంటనే మంటలను ఆర్పి వేశాడు. మరో బస్సులో వారిని నిజామాబాద్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment