ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శివారులో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. కడప డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలుకు వెళుతుండగా ఆళ్లగడ్డ శివారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి బస్సును వెంటనే ఆపారు. ప్రయాణికులందరూ బస్సు నుంచి దిగిపోయారు.
దాంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆపారు. 28 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటలు తలెత్తడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.