అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గూనిపల్లి వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా బస్సులో మంటలు రావడంతో ప్రాణభయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి రాయదుర్గం నుంచి కడపకు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, మంటలు చెలరేగడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.