నగరంలోని బర్కత్‌పురలో ఘోరం జరిగింది. తనను ప్రేమించాలంటూ విద్యార్థినిపై ఓ ఉన్మాది విచాక్షణారహితంగా దాడి చేశాడు. కొబ్బరి బోండాల కోసం వాడే కత్తితో అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని బర్కత్‌పురలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.