టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీ సన్నాహాకాల్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 2-0 తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలైంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లు గెలవగా.. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి.
అయితే ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో పాక్ విఫలమైంది. ఇక ఇంగ్లండ్ పర్యటనను ముగించుకుని పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్ కోసం అమెరికాకు శనివారం చేరుకోనుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఐర్లాండ్‌పై పాకిస్తాన్ షాకింగ్ ఓటమిని చవిచూస్తుందని ఉతప్ప జోస్యం చెప్పాడు. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ గ్రూపు-ఎలో భారత్, కెనడా, ఐర్లాండ్, అమెరికా జట్లతో కలిసి ఉంది. ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 6న యూఎస్ జట్టుతో తలపడనుంది.
అనంతరం జూన్ 9న భారత్, జూన్ 11న కెనడా, జూన్ 16న ఐర్లాండ్‌తో పాక్ తలపడనుంది. కాగా రబిన్ ఉతప్ప, భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గోనున్నారు. "ఐర్లాండ్ చిన్న జట్టు అని తక్కువ అంచనా వేయవద్దు. ప్రత్యర్ధి జట్లను ఓడించే సత్తా ఐర్లాండ్‌కు ఉంది. ఐర్లాండ్, పాకిస్తాన్, భారత్, కెనడా, యూఎస్‌ఎ జట్లు గ్రూపు-ఎలో ఉన్నాయి. ఈ నాలుగు జట్లలో ఐర్లాండ్ ఏ టీమ్‌ను ఓడిస్తుందని? ఉతప్పను అశ్విన్ ప్రశ్నించాడు. ఉతప్ప ఏమి ఆలోచించుకోకుండా వెంటనే పాకిస్తాన్ అంటూ సమాధనమిచ్చాడు.
"ఐసీసీ టోర్నీల్లో చిన్న చిన్న జట్ల చేతిలో ఓడిపోయే జట్లలో పాకిస్తాన్ ఒకటి. గత వరల్డ్‌కప్‌లో జింబావ్వే చేతిలో పాక్ ఓటమి చవిచూసిన సంగతి తెసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ ఫీల్డింగ్ మరి దారుణంగా ఉంటుంది. కీలక సమయాల్లో క్యాచ్‌లను జారవిడుస్తుంటారు. ఆసియాకప్‌లో కూడా అదే జరిగింది. అందుకే శ్రీలంకపై ఓటమి చవిచూశారు. పాకిస్తాన్ ఫీల్డింగ్ రోజురోజుకూ దిగజారిపోతుంది. కాబట్టి పాకిస్తాన్‌కు ఐర్లాండ్ షాక్ ఇస్తుందని నమ్ముతున్నానని" ఉతప్ప పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment