బిగ్‌బాస్‌లో శ్రీశాంత్‌? | Discarded Indian cricketer Sreesanth to be part of Bigg Boss 12 | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌లో శ్రీశాంత్‌?

Published Thu, Sep 6 2018 11:29 AM | Last Updated on Thu, Sep 6 2018 11:33 AM

Discarded Indian cricketer Sreesanth to be part of Bigg Boss 12 - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశమంతటా ఎంతో పాపులారిటీ సంపాదించిన బుల్లితెర రియాలిటీ షో 'బిగ్‌బాస్'. ఈ షో హిందీ వర్షన్‌లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 11 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న హిందీ 'బిగ్‌బాస్'.. మరికొద్ది రోజుల్లో అలరించడానికి సిద్ధమైంది.

హిందీలో జరిగే ఈ షోలో పాల్గొనే వారెవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, అనధికారికంగా బయటకు వచ్చిన పేర్లలో ఓ భారత క్రికెటర్‌ ఉన్నాడంటూ ప్రచారం జరుగుతుంది.  మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కారణంగా జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న కేరళ పేసర్‌ శ్రీశాంత్‌.. బిగ్‌బాస్‌ షో పాల్గొనబోతున‍్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడిన శ్రీశాంత్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌లో జైలు జీవితం కూడా గడిపాడు. యాంగ్రీ మ్యాన్‌గా పేరున్న శ్రీ.. షోలో చేరితే అది మరింత వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

ఆ కంటెస్టెంట్‌కు వారానికి 30 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement