
ఫిక్సింగ్‌కు సంబంధించి శిక్ష విధించే విషయంలో బీసీసీఐ తనపై కత్తిగట్టినట్లుగా పేసర్ శ్రీశాంత్ భావిస్తే దాన్ని అతను రుజువు చేయాలని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. బీసీసీఐ ఫిక్సింగ్ ఉదంతంలో ఉన్న మిగతా 13 మందిని ఒకలా తనను మరోలా పరిగణిస్తోందని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. ‘బీసీసీఐ తనపట్ల పక్షపాతంగా వ్యవహరిస్తుందనేది శ్రీశాంత్ వ్యక్తిగత అభిప్రాయం. దానిపై నేనేమీ మాట్లాడను. కానీ అదే నిజమైతే రుజువులతో రావాలని శ్రీశాంత్‌ను కోరుతున్నాను’ అని కపిల్ అన్నారు.