T20 WC: దినేశ్‌ కార్తిక్‌ లాగే అతడికి కూడా మద్దతు ఇవ్వాలి.. అప్పుడే: శ్రీశాంత్‌ | T20 WC Sreesanth: India Have To Support Bhuvneshwar Just Like Dinesh Karthik | Sakshi
Sakshi News home page

T20 WC 2022: దినేశ్‌ కార్తిక్‌ లాగే అతడికి కూడా అండగా ఉండాలి.. అప్పుడే: శ్రీశాంత్‌

Published Tue, Sep 27 2022 12:14 PM | Last Updated on Tue, Sep 27 2022 12:28 PM

T20 WC Sreesanth: India Have To Support Bhuvneshwar Just Like Dinesh Karthik - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ (PC: Sreesanth Twitter)

India Vs Australia 2022 T20 Series- Bhuvneshwar Kumar- T20 World Cup 2022: స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20లో 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్న భువీ.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇక హైదరాబాద్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీయగలిగాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 91 పరుగులు ఇచ్చాడు భువీ.

భువీ వైఫల్యం.. అభిమానుల్లో ఆందోళన
డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు, ప్రధాన పేసర్లలో ఒకడైన భువనేశ్వర్‌ ఇలా విఫలం కావడం జట్టు విజయావకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌-2022కు సమయం ఆసన్నమవుతున్న వేళ భువీ ఫామ్‌లేమి అభిమానులను కలవరపెడుతోంది. అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.


టీమిండియా ఆటగాళ్లతో భువీ

డీకేకు అండగా ఉన్నట్లే!
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. భువీపై నమ్మకం ఉంచి అతడికి అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు. వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ మాదిరి భువనేశ్వర్‌కు కూడా అండగా నిలవాలని సూచించాడు.

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌-2022లో భిల్వారా కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీశాంత్‌ హిందుస్థాన్‌ టైమ్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఒక్కోసారి మెరుగ్గా బౌలింగ్‌ చేసినప్పటికీ.. బ్యాటర్‌ చేతిలో మనకు పరాభవం తప్పకపోవచ్చు.

ఆస్ట్రేలియా పిచ్‌లపై రాణించగలడు
కొన్నిసార్లు మన వ్యూహం పక్కాగా అమలు అవుతుంది. మరికొన్నిసార్లు​ బెడిసికొడుతుంది. భువనేశ్వర్‌కు ఇప్పుడు మనందరి మద్దతు అవసరం. దినేశ్‌ కార్తిక్‌కు అండగా నిలిచినట్లే భువీకి కూడా సపోర్టుగా ఉండాలి.

బంతిని అద్భుతంగా స్వింగ్‌ చేయగల భువీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. తను నకుల్‌ బాల్‌ సంధించగలడు. పేస్‌లో వైవిధ్యం చూపగలడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై తను తప్పకుండా రాణిస్తాడని నాకు నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. 

ధైర్యంగా ఉండు భువీ!
విమర్శలు, కొంతమంది కామెంటేటర్ల మాటలు ఒక్కోసారి మనల్ని ఆందోళనకు గురిచేస్తాయని.. అయితే, మన నైపుణ్యాలు, సామర్థ్యాలపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని భువీకి సూచించాడు. విమర్శలు పట్టించుకోవద్దని.. ఆత్మవిశ్వాసంతో ఉండాలని భువీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీ ఆరంభం కానుంది. అంతకంటే ముందు టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడనుండగా.. భువీకి విశ్రాంతినిచ్చారు.

చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా ధావన్‌.. వైస్‌ కెప్టెన్‌గా శాంసన్‌!
Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్‌! ఇతర వివరాలు
Dinesh Karthik Vs Rishabh Pant: పంత్‌ కంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement