బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా దూరమైన గిల్ రెండో టెస్టు నుంచి అందుబాటులో వచ్చాడు.
ఇప్పటివరకు ఈ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్.. వరుసగా 31, 28, 1 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో స్వల్ప మార్పులు చేయాలని చేయాలని కార్తీక్ సూచించాడు.
"శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో చిన్న సాంకేతిక లోపం ఉంది. అతడు బంతిని బలంగా కొట్టడానికి ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోతున్నాడు. మీరు వైట్‌బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడే సమయంలో ఇది సహజంగా జరుగుతోంది. ట్రావిస్ హెడ్ కూడా అలానే ఆడేవాడు.
కానీ ఇప్పుడు అతడు తన సమస్యకు పరిష్కరం కనుగొన్నాడు. శుబ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు భారత కండీషన్స్‌కు ఎక్కువగా అలవాటు పడడంతోనే.. విదేశీ పిచ్‌లలో ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన వెంటనే మీ మనసు దానిని ఫుల్‌బాల్‌గా అంచనావేసి.. ఫ్రంట్ ఫుట్‌కు వెళ్లి ఆడమని చెబుతుంది.
కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి విదేశీ టార్‌లకు వెళ్లే ఆటగాళ్లు కొత్త బంతిని ఎలా ఆడాలో ముందే ప్రాక్టీస్ చేస్తారు. కొత్త బాల్‌ను ఆడేందుకు రెండు రకాలుగా ప్రయత్నిస్తారు. ఒకటి షాప్ట్ హ్యాండ్స్‌తో ఆడుతారు లేదా శరీరానికి దగ్గరగా బంతిని ఆడటం లేదా వదిలేయడం చేస్తారు. శుబ్‌మన్ గిల్ భారత్‌లో ఆడినట్లే ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు.
స్వదేశంలో పరిస్థితులకు ఆసీస్ కండీషన్స్‌కు చాలా తేడా ఉంది. బంతిని గట్టిగా హిట్ చేయడానకి వెళ్లి ఔట్ అవుతున్నాడు. గబ్బా వంటి స్టేడియాల్లో ఫ్రంట్ ఫుట్ ఆడటం కొంచెం కష్టం. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మీ మనస్సును నియంత్రించుకుని అలాంటి బంతులను వదిలేస్తాని నిర్ణయించుకోవాలి.
టెస్టుల్లో చాలా కాలం నుంచి నంబర్3లో ఆడుతున్నావు. అటువంటి అప్పుడు అంత సులువగా ఔట్ అవ్వడం సరైనది కాదు. నిజం చెప్పాలంటే గిల్ ఒక్కడే కాదు, భారత బ్యాటింగ్ సమష్టిగానే విఫలమవుతోంది. ప్రతీ ఇన్నింగ్స్‌లో వారు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అన్పిస్తోందని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment