సినిమాలో విలన్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్.. టీజర్ రిలీజ్ | Team India Cricketer Sreesanth's Yamadheera Movie Telugu Teaser | Sakshi

సినిమాలో విలన్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్.. టీజర్ రిలీజ్

Mar 14 2024 4:47 PM | Updated on Mar 14 2024 4:50 PM

Team India Cricketer Sreesanth Yamadheera Movie Teaser Telugu - Sakshi

టీమిండియా తరఫున పలు మ్యాచులాడి, ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్.. ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాలు చేసిన శ్రీశాంత్.. 'యమధీర' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. మార్చి 23న తెలుగులో రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. చిత్ర విశేషాలని పంచుకున్నారు.

(ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా?)

కన్నడ హీరో కోమల్ కుమార్, భారత క్రికెటర్ శ్రీశాంత్ ప్రతినాయక పాత్రలో నటించిన సినిమా 'యమధీర'. వేదాల శ్రీనివాస్ నిర్మించారు. నాగబాబు, అలీ, సత్య ప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని నటుడు-నిర్మాత అశోక్ కుమార్ లాంచ్ చేశారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్‌గా మైదానంలో చూపే దూకుడుని ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉందన్నారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement