కష్టకాలంలో భువనేశ్వరీ తోడుగా నిలిచింది: శ్రీశాంత్
కష్టకాలంలో భువనేశ్వరీ తోడుగా నిలిచింది: శ్రీశాంత్
Published Thu, May 29 2014 4:23 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
ముంబై: కష్టకాలంలో నా భార్య భువనేశ్వరీ కుమారి తోడుగా నిలిచిందని క్రికెటర్ శ్రీశాంత్ అన్నారు. నా జీవితంలో పెళ్లి అనేక మార్పులు తెచ్చింది అని శ్రీశాంత్ తెలిపారు.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ జీవితకాలపు వేటు గురైన శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం డాన్స్ లపైనే దృష్టి కేంద్రికరించానని.. ఐపీఎల్7చ్ లు చూడటం లేదు అని అన్నారు.
కోరియోగ్రాఫర్ స్నేహతో కలిసి ఝలక్ దిక్ లాజా అనే రియాల్టీ షో కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు. మ్యూజిక్, డాన్స్ లంటే చాలా ఇష్టమన్నారు. స్కూల్ కెళ్లేటప్పుడు డాన్స్ నేర్చుకున్నానని.. ఎప్పడూ పోటీలలో పాల్గొనలేదని శ్రీశాంత్ అన్నారు.
Advertisement
Advertisement