jhalak dikhhla jaa
-
ఈసారికి నన్ను వదిలేయండి: మాధురి
గడిచిన మూడేళ్లుగా డాన్సింగ్ రియాల్టీ షో 'ఝలక్ దిఖ్లాజా' కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్.. ఈసారి ఎనిమిదో సీజన్‌కు మాత్రం దానికి రావట్లేదట. కలర్స్ చానల్ నిర్వహించే ఈ ధమాకా డాన్స్ షోకు ఈసారి తనను జడ్జిగా ఉంచొద్దని మాధురి (48) చెప్పింది. అదే చానల్లో మరో ప్రాజెక్టు మీద తాను దృష్టి సారించాల్సి ఉందదని, అందువల్ల తనను ఈసారికి వదిలేయాలని కోరిందట. మరింత ఉత్తేజితంగా ఉండో మరో ప్రాజెక్టుతో తాను రాబోతున్నట్లు చెప్పింది. ఝలక్ దిఖ్లాజా కార్యక్రమం ఈసారి కూడా సూపర్ సక్సెస్ అవ్వాలంటూ శుభాకాంక్షలు మాత్రం అందజేసింది. ఝలక్ కార్యక్రమం మాధురిని తప్పకుండా మిస్సవుతుంది గానీ, చానల్లో మాత్రం మరో రూపంలో ఆమె వస్తారని కలర్స్ సీఈవో రాజ్ నాయక్ తెలిపారు. మాధురి స్థానంలో షాహిద్ కపూర్‌ను తీసుకుంటే ఎలా ఉంటుందని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. -
దిగ్భ్రాంతికి గురయ్యా!
‘ఝలక్ దిఖ్లా జా’ ఏడో సీజన్ నుంచి తప్పించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని బాలీవుడ్ నటుడు పూరబ్ కోహ్లి పేర్కొన్నాడు. తన ప్రదర్శనకు న్యాయమూర్తుల చక్కని స్పందన వచ్చిందని, అయినప్పటికీ ఈవిధంగా జరుగుతుందని తాను ఊహించలేద ని ఈ ‘రాక్ ఆన్’ స్టార్ చెప్పాడు. ‘నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ షోలో చక్కని ప్రదర్శన ఇచ్చా. నా ప్రదర్శనకు న్యాయమూర్తులు సైతం ఉబ్బితబ్బిబ్బయ్యారు. వారి నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అయితే డేంజర స్ జోన్‌కు రావడమే తీవ్ర నిరాశకు గురిచేసింది. 35 ఏళ్ల ఈ నటుడు తాను డేంజర స్ జోన్‌కు చేరుకున్నానని తెలియగానే డ్యాన్స్ స్టెప్పులను సైతం మరిచిపోయాడు. ‘ నా కొరియోగ్రాఫర్‌తో కలసి ఈ వారం సెమి క్లాసికల్ డ్యాన్స్ చేశా. అసలు నేనే స్టెప్పులు మరిచిపోయానా అని నాకు అనిపిస్తోంది. ఈ షోకోసం మేము తీవ్రంగా కష్టపడ్డాం. న్యాయమూర్తులనుంచి అద్భుతమైన స్పందన వస్తుందని కూడా ఆశించాం.’ అంటూ పూరబ్ బాధపడ్డాడు. ఈ షోలో పాల్గొన్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. మరోసారి అవకాశమిస్తే తన అదృష్టాన్ని పరిశీలించుకుంటానన్నాడు. శిక్షణ పొందిన నృత్యకారుడిని కాదని, అందువల్ల ఈ షోలనుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నాడు. కాగా ‘ఝలక్ దిఖ్లా జా’ షోలో ఇంకా 11 మంది సెలబ్రిటీ పోటీదారులు ఉన్నారు. వీరు తమ కొరియోగ్రాఫర్లతో కలసి ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంది. ఈ షోకు బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. -
టీవీక్షణం: ఈసారి ఝలక్ ఇచ్చేది ఎవరో!
ఒకప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ని మనవాళ్లు చాలా ఆసక్తిగా చూసేవారు. ప్రతివారం దాని కోసం ఎదురు చూసేవారు. ఎందుకంటే అప్పుడు మనకు అలాంటి డ్యాన్స్ షోలు కొత్త. కానీ ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే చాలు... ప్రతి చానెల్లోనూ అలాంటి ప్రోగ్రాములు బోలెడన్ని కనిపిస్తున్నాయి. పిల్లలకొకటి, పెద్దవాళ్లకొకటి, సెలెబ్రిటీలకొకటి, సెలెబ్రిటీ భార్యాభర్తలకొకటి.... రకరకాల థీమ్స్‌తో డ్యాన్స్ షోలు ప్రసారమవుతున్నాయి. అయితే ఏవో కొన్ని మాత్రమే ప్రత్యేక రీతిలో సాగి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. చానెళ్లకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అలాంటి షోలన్నింటిలోకీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది... ‘ఝలక్ దిఖ్లాజా’ గురించి! యూకేలోని ‘బీబీసీ ఒన్’ చానెల్లో ప్రసారమయ్యే ‘స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్’ షో కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని రూపొందించిందే ‘ఝలక్ దిఖ్లాజా’. కలర్స్ చానెల్‌వారు 2006లో దీన్ని ప్రారంభించారు. ఇప్పటికి ఆరు సిరీస్‌లు పూర్తయ్యాయి. ప్రముఖ సెలెబ్రిటీలను పోటీదారులుగా తీసుకొచ్చి, వాళ్లతో ఆడించి, అలరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గెలిస్తే పేరుతో పాటు, పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ లభిస్తుంది కాబట్టి సెలెబ్రిటీలు కూడా పోటీపడుతుంటారు ఈ షోలో పాల్గొనడానికి. ప్రముఖ నటి మాధురీ దీక్షిత్, దర్శకుడు కరణ్ జోహార్, కొరియోగ్రాఫర్ రెమోఫెర్నాండెజ్‌లు న్యాయ నిర్ణేతలు కావడం కూడా షోని నంబర్‌వన్ పొజిషన్లో నిలబెట్టింది. ఇటీవలే ప్రారంభమైన ఏడో సిరీస్‌లో కూడా ఫేమస్ సెలెబ్రిటీలే ఉన్నారు. బెట్టింగుల కారణంగా అరెస్టయ్యి వార్తలకెక్కిన శ్రీశాంత్, ‘రంగ్ రసియా’ సీరియల్ హీరో ఆశిష్ శర్మ, ‘పలక్’గా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’లో కడుపుబ్బ నవ్విస్తోన్న కికు షర్దా, ప్రముఖ గాయకుడు సుఖ్వీందర్ సింగ్, డ్యాన్సర్ శక్తీమోహన్... ప్రముఖ వీజేలు సోఫియా చౌదరి, ఆండీ... టీవీ నటీనటులు కరణ్ థాకర్, క్రితికా కామ్రా, పూరబ్ కోహ్లీ, పూజాబోస్, మౌనీ రాయ్... దబాంగ్ డ్యాన్స్‌తో ‘ఇండియాస్ గాట్ ట్యాలెంట్’ ద్వారా చెప్పలేనంత పాపులర్ అయిన చిట్టి డ్యాన్సర్ అక్షత్‌సింగ్‌లు ఈ సిరీస్‌లో పోటీ పడనున్నారు. మరి వీళ్లలో అసలు సిసలు ఝలక్ ఇచ్చేదెవరో... విజేతగా నిలిచేది ఎవరో! -
కష్టకాలంలో భువనేశ్వరీ తోడుగా నిలిచింది: శ్రీశాంత్
ముంబై: కష్టకాలంలో నా భార్య భువనేశ్వరీ కుమారి తోడుగా నిలిచిందని క్రికెటర్ శ్రీశాంత్ అన్నారు. నా జీవితంలో పెళ్లి అనేక మార్పులు తెచ్చింది అని శ్రీశాంత్ తెలిపారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ జీవితకాలపు వేటు గురైన శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం డాన్స్ లపైనే దృష్టి కేంద్రికరించానని.. ఐపీఎల్7చ్ లు చూడటం లేదు అని అన్నారు. కోరియోగ్రాఫర్ స్నేహతో కలిసి ఝలక్ దిక్ లాజా అనే రియాల్టీ షో కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు. మ్యూజిక్, డాన్స్ లంటే చాలా ఇష్టమన్నారు. స్కూల్ కెళ్లేటప్పుడు డాన్స్ నేర్చుకున్నానని.. ఎప్పడూ పోటీలలో పాల్గొనలేదని శ్రీశాంత్ అన్నారు. -
'ఝలక్ దిక్లా జా'లో హృతిక్, ప్రియాంక!
మాధురీ దీక్షిత్, రెమో డిసౌజా, కరణ్ జోహార్ లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఝలక్ దిక్లా జా షో లో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రాలు సందడి చేశారు. -
'బేషరమ్', '24' ప్రమోషన్
'24' టీవీ షో ప్రమోషన్ కార్యక్రమంలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ హల్ చల్ చేశారు. బేషరమ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ సింగ్, హీరో రణబీర్ కపూర్ సందడి చేశాడు. -
జంజీర్ చిత్ర ప్రమోషన్ స్టిల్స్
జంజీర్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ లు ఆగస్టు 20 తేదిన టెలివిజన్ రియాల్టీ డాన్స్ షో జలక్ దిక్లా జా సందడి చేశారు. జంజీర్ రీమేక్ చిత్రానికి అపూర్వ లకియా దర్శకుడు.