దిగ్భ్రాంతికి గురయ్యా! | I was shocked by my elimination from ‘Jhalak Dikhhla Jaa’: Purab Kohli | Sakshi
Sakshi News home page

దిగ్భ్రాంతికి గురయ్యా!

Published Mon, Jun 23 2014 10:40 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

I was shocked by my elimination from ‘Jhalak Dikhhla Jaa’: Purab Kohli

‘ఝలక్ దిఖ్‌లా జా’ ఏడో సీజన్ నుంచి తప్పించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని బాలీవుడ్ నటుడు పూరబ్ కోహ్లి పేర్కొన్నాడు. తన ప్రదర్శనకు న్యాయమూర్తుల చక్కని స్పందన వచ్చిందని, అయినప్పటికీ ఈవిధంగా జరుగుతుందని తాను ఊహించలేద ని ఈ ‘రాక్ ఆన్’ స్టార్ చెప్పాడు. ‘నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ షోలో చక్కని ప్రదర్శన ఇచ్చా. నా ప్రదర్శనకు న్యాయమూర్తులు సైతం ఉబ్బితబ్బిబ్బయ్యారు. వారి నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అయితే డేంజర స్ జోన్‌కు రావడమే తీవ్ర నిరాశకు గురిచేసింది. 35 ఏళ్ల ఈ నటుడు తాను  డేంజర స్ జోన్‌కు చేరుకున్నానని తెలియగానే డ్యాన్స్ స్టెప్పులను సైతం మరిచిపోయాడు.
 
 ‘ నా కొరియోగ్రాఫర్‌తో కలసి ఈ వారం సెమి క్లాసికల్ డ్యాన్స్ చేశా. అసలు నేనే స్టెప్పులు మరిచిపోయానా అని నాకు అనిపిస్తోంది. ఈ షోకోసం మేము తీవ్రంగా కష్టపడ్డాం. న్యాయమూర్తులనుంచి అద్భుతమైన స్పందన వస్తుందని కూడా ఆశించాం.’ అంటూ పూరబ్ బాధపడ్డాడు. ఈ షోలో పాల్గొన్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. మరోసారి అవకాశమిస్తే తన అదృష్టాన్ని పరిశీలించుకుంటానన్నాడు. శిక్షణ పొందిన నృత్యకారుడిని కాదని, అందువల్ల ఈ షోలనుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నాడు. కాగా ‘ఝలక్ దిఖ్‌లా జా’ షోలో ఇంకా 11 మంది సెలబ్రిటీ పోటీదారులు ఉన్నారు. వీరు తమ కొరియోగ్రాఫర్లతో కలసి ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంది. ఈ షోకు బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement