
లెజెండ్స్ లీగ్‌లో టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్- శ్రీశాంత్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వీరిదద్దరి మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం గంభీర్‌ను ఉద్దేశించి శ్రీశాంత్ చేసిన ఓ పోస్ట్.. ఈ గొడవకు మరింత అజ్యం పోసింది.
గంభీర్ తనను పదే పదే ఫిక్సర్ అన్నాడని, అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీశాంత్ ఓ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అయితే.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు పంపించారు. శ్రీశాంత్ టోర్నమెంట్ కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లఘించాడని కమిషనర్ నోటీస్‌లో పేర్కొన్నారు.
అలాగే సోషల్ మీడియాలో శ్రీశాంత్ పోస్ట్ చేసిన వీడియోలు తొలగించిన తర్వాతనే అతనితో చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ వివాదంపై అంపైర్‌లు ఇచ్చిన నివేదికలో శ్రీశాంత్‌ను శ్రీశాంత్‌ను గంభీర్ ఫిక్సర్ అన్నాడని ఎక్కడా పేర్కొనలేదు. కాగా వీరిద్దరూ భారత తరుపన కలిసి 49 మ్యాచ్‌లు ఆడారు. 2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో భాగస్వాములుగా ఉన్నారు.
చదవండి: IPL 2024: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!?
Comments
Please login to add a commentAdd a comment