
ఏషియన్ లెజెండ్స్ లీగ్ తొలి ఎడిషన్ (2025) నిన్న (మార్చి 10) ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్ లయన్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్ తదితర స్టార్లు ఆడుతున్నారు.
నిన్న జరిగిన టోర్నీ ఓపెనర్‌లో ఏషియన్ స్టార్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ తలపడ్డారు. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏషియన్ స్టార్స్.. ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. షోయబ్ ఖాన్ (63 బంతుల్లో 104 నాటౌట్) మెరుపు శతకంతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్ (65) అర్ద సెంచరీతో రాణించాడు.
అనంతరం బరిలోకి దిగిన ఏషియన్ స్టార్స్ కెప్టెన్ మెహ్రాన్ ఖాన్ (52 బంతుల్లో 109 నాటౌట్) సునామీ శతకంతో విరుచుకుపడటంతో 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మరో ఎండ్‌లో మెహ్రాన్ ఖాన్‌కు పెద్దగా సపోర్ట్ లేనప్పటికీ.. ఒంటిచేత్తో ఏషియన్ స్టార్స్‌ను గెలిపించాడు. ఏషియన్స్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో అంకిత్ నర్వాల్ (39), రాఘవ్ ధావన్ (34 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నిన్ననే జరగాల్సిన మరో మ్యాచ్ రద్దైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టైగర్స్, ఇండియన్ రాయల్స్‌తో తలపడాల్సి ఉండింది.
ఏషియన్ లెజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ జట్టు..
అంబటి రాయుడు, మనోజ్ తివారి, సుబ్రమణ్యం బద్రీనాథ్, ఫయాజ్ ఫజల్, శిఖర్ ధవన్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, నమన్ ఓఝా, శ్రీవట్స్ గోస్వామి, అనురీత్ సింగ్, మునాఫ్, కరణ్‌వీర్ సింగ్, బరిందర్ శ్రాన్, షాదాబ్ జకాతి, మన్‌ప్రీత్ గోని, సుదీప్ త్యాగి
Comments
Please login to add a commentAdd a comment