LLC 2024 Final: రెచ్చిపోయిన మసకద్జ | Legends League Cricket Final 2024: Southern Super Stars Set 165 Runs Target To Konark Suryas Odisha, See Details | Sakshi
Sakshi News home page

LLC 2024 Final: రెచ్చిపోయిన మసకద్జ

Oct 16 2024 9:09 PM | Updated on Oct 17 2024 1:35 PM

Legends League Cricket Final 2024: Southern Super Stars Set 165 Runs Target To Konark Suryas Odisha

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2024 సీజన్‌ ఫైనల్లో సదరన్‌ సూపర్‌ స్టార్స్‌, కోణార్క్‌ సూర్యాస్‌ ఒడిశా జట్లు పోటీపడుతున్నాయి. శ్రీనగర్‌ వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 16) జరుగుతున్న ఫైనల్లో కోణార్క్‌ సూర్యాస్‌ ఒడిశా టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కోణార్క్‌ సూర్యాస్‌ ఒడిశా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌ స్టార్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 

హ్యామిల్టన్‌ మసకద్జ మెరుపు ఇన్నింగ్స్‌ (58 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి సూపర్‌ స్టార్స్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. సూపర్‌ స్టార్స్‌ ఇన్నింగ్స్‌లో మార్టిన్‌ గప్తిల్‌​ 27, శ్రీవట్స్‌ గోస్వామి 0, పవన్‌ నేగి 33, చతురంగ డిసిల్వ 9, చిరాగ్‌ గాంధీ 0, ఎల్టన్‌ చిగుంబర ఒక్క పరుగు చేశారు. దిల్షన్‌ మునవీర వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో సూపర్‌ స్టార్స్‌ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించింది. కోణార్క్‌ సూర్యాస్‌ ఒడిశా బౌలర్లలో మునవీర నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇర్ఫాన్‌ పఠాన్‌, దివేశ్‌ పఠానియా తలో వికెట్‌ దక్కించుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement