ఐపీఎల్‌ వేలం.. బరిలో అర్జున్‌ టెండూల్కర్‌ | Sreesanth And Arjun Tendulkar Registers for IPL 2021 auction | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ వేలం.. బరిలో అర్జున్‌ టెండూల్కర్‌

Published Sat, Feb 6 2021 5:30 AM | Last Updated on Sat, Feb 6 2021 1:09 PM

Sreesanth And Arjun Tendulkar Registers for IPL 2021 auction - Sakshi

చెన్నై: వివాదాస్పద భారత క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌లో మళ్లీ ఆడేందుకు తహతహలాడుతున్నాడు. ఈ సీజన్‌ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు రూ. 75 లక్షల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫిక్సింగ్‌ మరకలున్న అతనిపై ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూస్తోందో వేచి చూడాలి. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ కూడా ఈ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అర్జున్‌ రూ. 20 లక్షల కనీస ధరతో పేరును రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఈ నెల 18న జరిగే ఆటగాళ్ల వేలానికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది.

మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో కేవలం 61 ఖాళీలే ఉన్న ఈ సీజన్‌ కోసం 1,097 మంది ఆటగాళ్లు వేలంలో పోటీపడుతున్నారు. మిషెల్‌ స్టార్క్, ప్యాటిన్సన్‌ (ఆస్ట్రేలియా), జో రూట్‌ (ఇంగ్లండ్‌)లాంటి అంతర్జాతీయ స్టార్లు ఈ వేలంలో పాల్గొనడం లేదు. వేలం బరిలో 814 మంది భారత ఆటగాళ్లు (21 అంతర్జాతీయ క్రికెటర్లు, 793 అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు) ఉన్నారు. 283 మంది విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీల కంటపడేందుకు బోర్డు వద్ద తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఆటగాళ్ల నమోదుకు గడువు గురువారంతో ముగియడంతో బీసీసీఐ వేలం జాబితాను శుక్రవారం విడుదల చేసింది. విదేశాల నుంచి అందుబాటులో ఉన్న క్రికెటర్లలో వెస్టిండీస్‌ ఆటగాళ్లే (56 మంది) ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత సంఖ్య ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38) ఆటగాళ్లది. ప్రస్తుతమున్న 61 ఖాళీల్లో విదేశీ ఆటగాళ్లతోనే 22 స్థానాల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.

రూ. 2 కోట్ల ధరలో...  
హర్భజన్‌ సింగ్, కేదార్‌ జాదవ్‌ (భారత్‌), స్టీవ్‌ స్మిత్, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా), షకీబుల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌), మొయిన్‌ అలీ, బిల్లింగ్స్, ప్లంకెట్, జేసన్‌ రాయ్, మార్క్‌ వుడ్‌ (ఇంగ్లండ్‌), ఇంగ్రామ్‌ (దక్షిణాఫ్రికా).  

ఏ దేశం నుంచి ఎందరంటే...
వెస్టిండీస్‌ (56), ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38), శ్రీలంక (31), అఫ్గానిస్తాన్‌ (30), న్యూజిలాండ్‌ (29), ఇంగ్లండ్‌ (21), యూఏఈ (9), నేపాల్‌ (8), స్కాట్లాండ్‌ (7), బంగ్లాదేశ్‌ (5), ఐర్లాండ్‌ (2), అమెరికా (2), జింబాబ్వే (2), నెదర్లాండ్స్‌ (1).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement