ఫిక్సింగ్ ఆటగాళ్లపై బీసీసీఐ అయిదేళ్ల వేటు!
ముంబయి : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నలుగురు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు దోషులుగా తేలారు. శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకీత్ చవాన్ ఫిక్సింగ్ పాల్పడినట్లు బీసీసీఐ దర్యాప్తు కమిటీ నిర్దారించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకీత్ చవాన్‌ల వ్యవహారంపై రవి సవానీ నేతృత్వంలోని దర్యాప్తు కమిటీ విచారణ జరిపింది. కమిటీ విచారణలో నలుగురు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ మేరకు దర్యాప్తు నివేదిక సమర్పించిన కమిటీ... ఆ నలుగురిపై ఐదేళ్ల నుంచి జీవితకాల నిషేధం విధించాలని సూచించింది.
కాగా ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కున్న రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా భవితవ్యంపై నేడు బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ ముగ్గురి వ్యవహారంపై ఇప్పటికే అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ రవి సవానీ గత నెలలో బోర్డు వర్కింగ్ కమిటీకి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ నేడు సమావేశం అవుతోంది.
అరుణ్ జైట్లీ, నిరంజన్ షా నేతృత్వంలోని ఈ కమిటీ వీరి గురించి చర్చించనుంది. తదనంతరం తమ అభిప్రాయాలను ఈనెల 29న జరిగే వార్షిక సమావేశం ముందుంచుతారు. ఢిల్లీ పోలీసులచే అరెస్ట్ అయిన ఈ త్రయం ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. ఫిక్సింగ్ వ్యవహారం బయటపడగానే ఈ ముగ్గురి ఆటగాళ్ల ఒప్పందాన్ని రాజస్థాన్ జట్టు ఉపసంహరించుకుంది.