శ్రీశాంత్‌ నాతో సహజీవనం చేశాడు : హీరోయిన్‌ | Sreesanth Ex GF Nikesha Claims Sreesanth Cheated His Wife | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 17 2018 9:47 AM | Last Updated on Wed, Oct 17 2018 4:15 PM

Sreesanth Ex GF Nikesha Claims Sreesanth Cheated His Wife - Sakshi

మరి తన సంగతేంటి అని క్రికెటర్‌ శ్రీశాంత్‌పై మండి పడుతోంది నికీషాపటేల్‌. ఈ అమ్మడి కథేంటో చూద్దాం. ఈ పంజాబీ బ్యూటీ దక్షిణాదిలో తొలిసారిగా తెలుగులో పవన్‌కల్యాణ్‌తో కొమరం పులి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కోలీవుడ్‌కు ఎన్నమో ఏదో చిత్రంతో దిగుమతై ఇక్కడ చాలా చిత్రాలు చేసింది. అయినా స్టార్‌ ఇమేజ్‌కు ఇంకా ఎదగలేదు.

మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న నికీషాపటేల్‌పై వదంతులు చాలానే ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి క్రికెటర్‌ శ్రీశాంత్‌తో చెట్టాపట్టాల్‌ అన్నది ఒకటి. క్రికెట్‌ రంగంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొని, కొంతకాలం ఆ క్రీడకు దూరమైన శ్రీశాంత్‌ నటుడిగా రంగప్రవేశం చేశాడు. ఈయనతో నటి నికీషాపటేల్‌ ప్రేమ వ్యవహారం మీడియాల్లో పెద్ద ఎత్తున షికారు చేసింది. 
 

వీరిద్దరూ ప్రేమలో పడి సహజీవనం చేశారనే ప్రచారం చాలా కాలం క్రితమే హోరెత్తింది. అయితే దీని గురించి అప్పట్లో ఈ సంచలన జంట నోరు మెదపలేదు. కొంతకాలం క్రితం భువనేశ్వరి అనే యువతిని శ్రీశాంత్‌ వివాహం చేసుకున్నాడు. ఇది జరిగిన చాలా కాలం తరువాత ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్‌ తాను భువనేశ్వరిని ఏడేళ్లుగా ప్రేమించి పెళ్లిచేసుకున్నానని చెప్పాడు.

ఆయన భేటీని చూసిన నికీషాపటేల్‌ ఆగ్రహానికి గురైంది. దీంతో శ్రీశాంత్‌తో ఉన్న తన బంధాన్ని బట్టబయలు చేసింది. దీని గురించి నికీషాపటేల్‌ మాట్లాడుతూ వేరే అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తూ వచ్చిన శ్రీశాంత్‌ తనతో ఒక ఏడాది సహజీవనం చేసిన సంగతి గురించి ఏం చెబుతాడని ప్రశ్నించింది. అంతే కాదు తాను శ్రీశాంత్‌తో బ్రేకప్‌ చేసుకున్న తరువాత ఏడేళ్లుగా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నానని చెప్పింది. అయితే శ్రీశాంత్‌ నిజాన్ని దాచడం మాత్రం తాను సహించలేకపోతున్నానని నికీషా పటేల్‌ అంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement