
బైక్ రేస్...
ఇండియన్ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా సురేష్ గోవింద్ తెరకెక్కిం చిన చిత్రం ‘టీమ్ 5’. నిక్కీ గర్లాని కథనాయిక. రాజ్ జకారియస్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ నెల 21న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు దాము, రాజ్ కందుకూరి లాంచ్ చేశారు. పాటలు ‘మధుర’ ఆడియో ద్వారా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. రాజ్ జకారియస్ మాట్లాడుతూ– ‘‘ఐదుగురు స్నేహితులు, బైక్ రేసింగ్ పై నడిచే కథ ఇది. శ్రీశాంత్ యాక్టింగ్, డ్యాన్స్ సూపర్‌గా చేశారు’’ అన్నారు. ‘‘క్రికెటర్‌గా నన్ను అభిమానించినవారు, యాక్టర్‌గా కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి సందేశం ఇస్తుంది’’ అన్నారు శ్రీశాంత్. ఈ చిత్రానికి సహ నిర్మాత: అన్సార్ రషీద్.