తిరువనంతపురం : క్రికెటర్ శ్రీశాంత్(37)ను తిరిగి కేరళ రంజీ జట్టులోకి తీసుకోవాలని కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) నిర్ణయించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్‌పై విధించిన నిషేధం గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. అయితే అతను అన్ని ఫిట్‌నెస్ పరీక్షల్లో నెగ్గితేనే నిషేధం గడువు ముగిసిన తర్వాత తిరిగి జట్టులో అవకాశం లభించనుంది. ‘నాకు అవకాశం ఇచ్చినందుకు కేరళ క్రికెట్ అసోసియేషన్‌కి రుణపడి ఉంటాను. నా ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని తిరిగి మైదానంలో అడుగుపెడతాను. ఇప్పటికైనా అన్ని వివాదాలకు పుల్‌స్టాప్‌పడుతుంది అనుకుంటున్నాను’ అని శ్రీశాంత్ అన్నాడు. శ్రీశాంత్ పునరాగమనంతో కేరళ రంజీ జట్టుకు మరింత బలం చేకూరుతుందని కేసీఏ కార్యదర్శి శ్రీత్ నాయర్ అన్నారు. (అవన్నీ తప్పుడు వార్తలు: ఆఫ్రిది)
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013లో శ్రీశాంత్‌తోపాటూ రాజస్థాన్ రాయల్స్ జట్టులో అతని సహచరులు అజిత్ చంఢీలా, అంకిత్ చవాన్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిపై బీసీసీఐ జీవిత కాలం నిషేధం విధించింది. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని శ్రీశాంత్ సుదీర్ఘ పోరాటం చేశాడు. దీనిపై పలుమార్లు సుప్రీంకోర్టుకు వెళ్లి తనపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాడు. దానిలో భాగంగానే శ్రీశాంత్‌కు శిక్ష తగ్గించే విషయంపై ఆలోచించాలని బీసీసీఐకి సూచించిన సుప్రీం కోర్టు ఆ అధికారాన్ని అంబుడ్స్‌మన్‌కు అప్పగించింది. (సచిన్ కెప్టెన్సీ వైఫల్యంపై మదన్‌లాల్ కామెంట్స్)
సుప్రీంకోర్టు ఆదేశాలతో శ్రీశాంత్‌పై ఉన్న జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్ ప్రవర్తన బాగుందని భావించిన అంబుడ్స్‌మన్ అతనిపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే ఏడేళ్ల నిషేధం సరిపోతుందని స్పష్టం చేశారు. టీం ఇండియా తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ-20 మ్యాచులు ఆడాడు. (‘2007లోనే సచిన్ ఆటను వదిలేద్దామనుకున్నాడు’)
Comments
Please login to add a commentAdd a comment