కేరళలో బీజేపీకి 70కిపైగా సీట్లు గ్యారంటీ!! | Sreesanth gave 70 seats to BJP in Kerala, exit polls give 0-4 | Sakshi
Sakshi News home page

కేరళలో బీజేపీకి 70కిపైగా సీట్లు గ్యారంటీ!!

Published Tue, May 17 2016 4:24 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

కేరళలో బీజేపీకి 70కిపైగా సీట్లు గ్యారంటీ!!

కేరళలో బీజేపీకి 70కిపైగా సీట్లు గ్యారంటీ!!

ఆశకు హద్దు ఉండాలి. సానుకూల ఆలోచనలకూ కొంత పరిమితి ఉండాలి.. అంటే టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్ అస్సలు ఒప్పుకోవడం లేదు.

తిరువనంతపురం: ఆశకు హద్దు ఉండాలి. సానుకూల ఆలోచనలకూ కొంత పరిమితి ఉండాలి.. అంటే టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్ అస్సలు ఒప్పుకోవడం లేదు. తాను చాలా ఆశావాదినని, కాబట్టి కేరళలో బీజేపీకి 70కిపైగా సీట్లు వస్తాయని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు.

కేరళలో ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ బోణీ కొట్టలేదు. ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే సీటుగానీ, ఒక్క ఎంపీ సీటుగానీ గెలువని కమలం పార్టీ ఈసారి శ్రీశాంత్‌పై భారీ ఆశలే పెట్టుకున్నది. ప్రతిష్టాత్మకమైన తిరువనంతపురం నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. ఈ సందర్భంగా సోమవారం ఎర్నాకులంలోని పోలింగ్ బూత్‌లో ఓటువేసిన అనంతరం శ్రీశాంత్‌ మీడియాతో మాట్లాడుతూ 'నేను చాలా ఆశావాదిని. బీజేపీకి 70కిపైగా సీట్లు వస్తాయి' అని ధీమాగా చెప్పాడు.

కానీ ఆశావాదంపై నీళ్లు చల్లుతూ సాయంత్రం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీకి సున్నా నుంచి నాలుగు సీట్లు వచ్చే అవకాశముందని తేలింది. దీంతో రుసరుసలాడుతున్న శ్రీశాంత్‌ అంతా అధికార యూడీఎఫ్‌, ప్రతిపక్ష ఎల్డీఎఫ్‌ గురించే మాట్లాడుతున్నారని, బీజేపీకి ఓటువేసిన వారి సంగతి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు శ్రీశాంత్ ఆశలు ఏమేరకైనా నిలబడతాయా అన్నది రెండ్రోరోజుల్లో వెలువడే ఫలితాల్లో తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement