'శ్రీశాంత్‌ను కొట్టాలనుకున్నా' | Wanted To Hit Him On The Head': Andre Nel Recalls Rivalry With Sreesanth | Sakshi
Sakshi News home page

'శ్రీశాంత్‌ను కొట్టాలనుకున్నా'

Published Mon, Jan 22 2018 12:13 PM | Last Updated on Mon, Jan 22 2018 12:17 PM

Wanted To Hit Him On The Head': Andre Nel Recalls Rivalry With Sreesanth - Sakshi

జోహెనెస్‌బర్గ్‌: దాదాపు పదేళ్ల క్రితం జరిగిన సంఘటనను దక్షిణాఫ్రికా మాజీ పేస్‌ బౌలర్‌ ఆండ్రీ నెల్‌ మరోసారి గుర్తు చేసుకున్నాడు. 2006లో జోహెనెస్‌బర్గ్‌లో తమతో జరిగిన టెస్టు మ్యాచ్‌ సందర్బంగా శ్రీశాంత్‌ను తలపై బలంగా కొట్టాలన‍్న కసి వచ్చిందనే విషయాన్ని నెల్‌ తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు ఓ క్రీడా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర‍్య్వూలో ఆనాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నాడు.

'నేను బ్యాట్స్‌మన్‌ను కవ్వించే క్రమంలో శ్రీశాంత్‌తో ముందుగా స్లెడ్డింగ్‌కు దిగా. అయితే అప్పుడు నేను ఏమని వ్యాఖ్యానించానో కచ్చితంగా గుర్తులేదు. కాకపోతే శ్రీశాంత్‌ను బాగా రెచ్చగొట్టా. నేను రెచ్చగొట్టిన తర్వాత బంతిని శ్రీశాంత్‌ స్టైట్‌గా సిక్స్‌గా మలిచాడు. అదే క‍్రమంలో పిచ్‌ మధ్యకు వచ్చిన శ్రీశాంత్‌ డ్యాన్స్‌ చేయడం మొదలుపెట్టాడు. ఆ తరహా సెలబ్రేషన్‌ను అంతకుముందెన్నడూ నేను చూడలేదు. ఆ సమయంలో శ్రీశాంత్‌ తలపై బలంగా కొడదామనేంత ఆవేశం వచ్చింది. ఆపై కూల్‌గా కావడంతో ఎటువంటి వివాదం జరగలేదు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత శ్రీశాంత్‌ దగ్గరకు వెళ్లి షేక్‌హ్యాండ్‌ ఇచ్చా. ఆ క్రమంలో మేమిద్దరం నవ్వుకున్నాం. ఇటువంటి ఘటనలు కనీసం చెప్పకోవడానికి ఉండాలి. దూకుడుగా ఉండటం నాకు కూడా ఇష్టమే. నేను కవ్వించిన తర్వాత బంతిని సిక్స్‌గా కొట్టడాన్ని శ్రీశాంత్‌ బాగా ఎంజాయ్‌ చేసుంటాడు. నిజంగా చాలా సరదాగా ఉండే మనస్తత్వం శ్రీశాంత్‌ది' అని నెల్‌ గత స్మృతుల‍్ని గుర్తుచేసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement