
న్యూఢిల్లీ: జీవితకాల నిషేధానికి గురైన వివాదాస్పద పేసర్ శ్రీశాంత్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి వైఖరేంటో తెలపాలని సుప్రీం కోర్టు కోరింది. తనపై బోర్డు విధించిన నిషేధాన్ని శ్రీశాంత్ సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేయగా... చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది.
అనంతరం నాలుగు వారాల్లో స్పందన తెలపాలని బోర్డుతో పాటు, సుప్రీం నియమించిన పరిపాలక కమిటీని త్రిసభ్య బెంచ్ ఆదేశించింది.క్రికెటర్ తరఫున సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపించారు. శ్రీశాంత్ ఆడేందుకు మధ్యంతర తీర్పు ఇవ్వాలని కోరారు. అయితే సుప్రీం బెంచ్ మాత్రం అలాంటి ఆదేశాలివ్వలేమని ఆ వినతిని తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment