కొచ్చి: పేసర్ శ్రీశాంత్ నిషేధం వ్యవహారంలో బీసీసీఐకి కేరళ హైకోర్టు లీగల్ నోటీసులను జారీ చేసింది. 2013లో వెలుగు చూసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీశాంత్‌పై బోర్డు జీవితకాల నిషేధాన్ని విధించింది. అయితే గతంలోనే స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి విముక్తి దొరికినా బోర్డు పట్టించుకోవడం లేదని తను కోర్టుకెక్కాడు. దీంతో ఈ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా పరిపాలక కమిటీ (సీఓఏ)కి జస్టిస్ పీబీ సురేశ్ కుమార్‌తో కూడిన బెంచ్ నోటీసును పంపింది. తదుపరి విచారణ జూన్ 19న జరుగుతుంది.