
చెన్నై: ఇటీవల తన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించడంతో క్రికెటర్ శ్రీశాంత్ మరోసారి సినిమాల్లో బిజీ అయిపోయాడు. రెండు నెలల క్రితం బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్.. శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని ఏడేళ్లకు కుదించిన నేపథ్యంలో వచ్చే ఏడాదితో అతనిపై ఉన్న నిషేధం గడువు ముగిసిపోనుంది. అయితే కొన్నాళ్లుగా వెండితెరపై దృష్టి సారించిన శ్రీశాంత్ కోలీవుడ్‌లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. హారర్, కామెడీతో రూపొందనున్న తమిళ సినిమాలో శ్రీశాంత్ నటించనున్నాడు.
హరి- హరీశ్ ద్వయం దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ హన్సికా లీడ్ రోల్‌లో చేస్తుండగా, అదే సమయంలో శ్రీశాంత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. వీరిద్దరి మధ్య ఒక ఫైట్ సీన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అన్ని ఎలిమెంట్లు గల కలిసిన ఈ మసాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ను శ్రీవారి ఫిల్మ్స్ బ్యానర్‌లో పి రంగనాథన్ నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment