
శ్రీశాంత్‌కు బీసీసీఐ అనుమతి నిరాకరణ
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్ పునరాగమన ఆశలపై బీసీసీఐ నీళ్లు జల్లింది. స్కాట్లాండ్ క్రికెట్ లీగ్‌లో ఆడాలని చూస్తున్న ఈ కేరళ స్పీడ్‌స్టర్‌కు నిరభ్యంతర పత్రం మంజూరు చేయడానికి బీసీసీఐ నిరాకరించింది.
2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని, అందుకే అతడిపై జీవితకాల నిషేధం విధించామని బోర్డుకు చెందిన అధికారి తెలిపారు. 2015లో ఢిల్లీ కోర్టు నుంచి అతడికి క్లీన్‌చిట్ లభించినా నిషేధం ఎత్తివేసే విషయంలో తుది నిర్ణయం బీసీసీఐకే ఉంటుందన్నారు.