పోలీసులే బలవంతంగా ఒప్పించారు: శ్రీశాంత్ | i accepted the case due to police pressure: sree santh | Sakshi
Sakshi News home page

పోలీసులే బలవంతంగా ఒప్పించారు: శ్రీశాంత్

Published Tue, Sep 17 2013 1:50 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM

i accepted the case due to police pressure: sree santh


 న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో నేరాన్ని ఒప్పుకోవాలని ఢిల్లీ పోలీసులు బలవంతం చేశారని నిషేధిత బౌలర్ శ్రీశాంత్ బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పట్లో బోర్డు నియమించిన క్రమశిక్షణ కమిటీకి రాసిన ఈ లేఖలోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ‘నేరాన్ని అంగీకరించాల్సిందిగా పోలీసులు బలవంతపెట్టారు. పైగా నా సన్నిహితుల్ని కూడా ఇందులో ఇరికిస్తామని, అరెస్టు కూడా చేస్తామని వాళ్లు భయపెట్టారు.
 
  అలా నేను తప్పును ఒప్పుకున్నట్లుగా చెప్పించి స్టేట్‌మెంట్‌ను తయారు చేశారు. దీనిపై నా సంతకాన్ని కూడా తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు నన్ను శారీరకంగా, మానసికంగా వేధించడం వల్లే సంతకం చేయాల్సి వచ్చింది’ అని శ్రీశాంత్ లేఖలో పేర్కొన్నాడు. పోలీసుల స్టేట్‌మెంట్‌లో ఉన్నవి పూర్తిగా నిరాధారమైన అంశాలన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement