ఓవర్ టు సిల్వర్ స్క్రీన్ | Indian Cricketer Turned Dancer, Sreesanth on Silver Scree | Sakshi
Sakshi News home page

ఓవర్ టు సిల్వర్ స్క్రీన్

Published Sat, Aug 9 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

ఓవర్ టు సిల్వర్ స్క్రీన్

ఓవర్ టు సిల్వర్ స్క్రీన్

క్రికెటర్‌గా... అంతకు మించి కాంట్రావర్షియల్ సెలబ్రిటీగా బాగా పాపులర్ అయిన శ్రీశాంత్ హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో శుక్రవారం ప్రత్యక్షమయ్యాడు. అడిగిన వారికల్లా ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడమే కాదు.. ఫొటోలకూ ఫోజులిస్తూ కనిపించాడు. ఈ సడెన్ విజిట్ వెనుక సీక్రెట్ ఏంటని అడిగితే.. ‘సిల్వర్ స్క్రీన్‌పై  చూడండి’ అంటూ అభినయిస్తూ మరీ చెప్పాడు. ‘తెలుగు సినిమాల్లో నటించబోతున్నా.. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులతో చర్చలు జరుగుతున్నాయి’ అని సిటీ విజిటింగ్ గుట్టు రట్టు చేశాడు.
 
  ఎవరితో చర్చలు జరుపుతున్నారో చెప్పమంటే.. ‘ప్రస్తుతానికి పూరీ జగన్నాథ్‌తో డిస్కషన్స్‌లో ఉన్నా’నంటూ ట్విస్ట్ ఇచ్చాడు. మంచి ఫిజిక్‌తో.. బాడీపై టాటూలతో.. టాప్ టు బాటమ్ ఫుల్ మేకోవర్ చేయించుకున్నట్టు కనిపించిన ఈ క్రికెటర్ తాజా అవతారం కాస్త డిఫరెంట్‌గానే ఉంది. మొన్నటి దాకా క్రికెట్ పిచ్, ఆ తర్వాత ర్యాంప్‌లూ, టీవీ షోలు... ఇలా ఏదో రూపంలో అలరిస్తున్న శ్రీని త్వరలోనే తెలుగు తెరపై చూడొచ్చన్నమాట.
 - ఎస్బీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement