novetel hotel
-
బైక్ వీరులు
హార్లీ డేవిడ్ సన్ రైడర్స్ సౌత్‌జోన్ మూడో ర్యాలీ జాయ్‌ఫుల్‌గా సాగింది. ఎయిర్‌పోర్టులోని హోటల్ నోవాటెల్‌లో శుక్రవారం జరిగిన ఈవెంట్‌కు దేశంలోని 13 నగరాలకు చెందిన హార్లీ డేవిడ్సన్ బైక్ ఓనర్స్ హాజరయ్యారు. ఆయా నగరాల నుంచి 600 మంది బైక్‌లపై ఇక్కడకు చేరుకున్నారు. వారు వెంట తీసుకొచ్చిన కస్టమైజ్డ్ బైక్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి. వారికి కాంపిటీషన్స్ కూడా నిర్వహించారు. మరో పోటీ.. ఆర్మ్ రెజ్లింగ్ అదరహో అనిపించింది. -
ఓవర్ టు సిల్వర్ స్క్రీన్
క్రికెటర్‌గా... అంతకు మించి కాంట్రావర్షియల్ సెలబ్రిటీగా బాగా పాపులర్ అయిన శ్రీశాంత్ హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో శుక్రవారం ప్రత్యక్షమయ్యాడు. అడిగిన వారికల్లా ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడమే కాదు.. ఫొటోలకూ ఫోజులిస్తూ కనిపించాడు. ఈ సడెన్ విజిట్ వెనుక సీక్రెట్ ఏంటని అడిగితే.. ‘సిల్వర్ స్క్రీన్‌పై చూడండి’ అంటూ అభినయిస్తూ మరీ చెప్పాడు. ‘తెలుగు సినిమాల్లో నటించబోతున్నా.. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులతో చర్చలు జరుగుతున్నాయి’ అని సిటీ విజిటింగ్ గుట్టు రట్టు చేశాడు. ఎవరితో చర్చలు జరుపుతున్నారో చెప్పమంటే.. ‘ప్రస్తుతానికి పూరీ జగన్నాథ్‌తో డిస్కషన్స్‌లో ఉన్నా’నంటూ ట్విస్ట్ ఇచ్చాడు. మంచి ఫిజిక్‌తో.. బాడీపై టాటూలతో.. టాప్ టు బాటమ్ ఫుల్ మేకోవర్ చేయించుకున్నట్టు కనిపించిన ఈ క్రికెటర్ తాజా అవతారం కాస్త డిఫరెంట్‌గానే ఉంది. మొన్నటి దాకా క్రికెట్ పిచ్, ఆ తర్వాత ర్యాంప్‌లూ, టీవీ షోలు... ఇలా ఏదో రూపంలో అలరిస్తున్న శ్రీని త్వరలోనే తెలుగు తెరపై చూడొచ్చన్నమాట. - ఎస్బీ -
తోపులాట
పవన్‌కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో లాఠీ చార్జీ గచ్చిబౌలి, న్యూస్‌లైన్: మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో హీరో పవన్‌కల్యాణ్ ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభకు శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు పాస్‌లు లేక అగచాట్లు పడ్డారు. మాదాపూర్‌లోని న్యాక్ ప్రధాన ద్వారం వద్ద బారులుదీరారు. సాయంత్రం 4.30 సమయంలో అభిమానులు పాస్‌లు కావాలని నినదిస్తూ ఒక్కసారిగా న్యాక్ గేట్ వైపు దూసుకు రావడంతో తోపులాట జరిగింది. అప్రమత్తమైన పోలీసు లు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. సా.గం.6కు పాస్‌లు లేకపోయినా అభిమానులను లోపలికి అనుమతించారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో కిందపడిన బౌన్సర్‌ను అభిమానులు తొక్కుకొంటూ వెళ్లిపోయారు. అతని కాలు విరిగిం ది. ఓ అభిమాని కాలుకు గాయమైంది. ఉదయం నుంచే మాదాపూర్ ఇమేజ్ గార్డెన్‌కు అభిమానులు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి పోలీసులు న్యాక్ ప్రధాన ద్వారం వద్ద లోపలికి అనుమతించారు. సభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కొన్ని థియేటర్లలో కూడా దీన్ని ప్రసారం చేశారు. సైబరాబాద్ పోలీసులు దాదాపు 200 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాక్ ప్రధాన ద్వారం, నొవాటెల్ హోటల్ చెక్ పాయింట్, హెచ్‌సీసీ ప్రధాన ద్వారం వద్ద తనిఖీలు చేశారు. ‘నాకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అంటే అభిమానం. పవన్ ప్రసంగం వినేందుకు నల్లగొండ నూతకల్లు నుంచి వచ్చా’నని 70 ఏళ్ల వృద్ధుడు రాజిరెడ్డి చెప్పారు. ‘పవన్ అంటే ఎంతో ఇష్టం. జనసేన పార్టీలో చేరతా’నని కడప జిల్లాకు చెందిన మోహన్‌రెడ్డి సంతోషంగా చెప్పారు.