శ్రీశాంత్
Sreesanth Once Ate Two-Day Old Banana: ‘మానే కాక(రమేశ్ మానే) అప్పట్లో టీమిండియాతో ప్రయాణించేవాడు. మసాజ్ చేయడంతో పాటుగా పూజలు కూడా చేస్తుండేవాడు. నిజానికి శ్రీశాంత్‌కు ‘మూఢనమ్మకాలు’ ఎక్కువ. తనలాంటి ఫాస్ట్‌బౌలర్‌ను నేనైతే ఎప్పుడూ చూడలేదు. మానే కాక.. పూజ సమయంలో అగర్‌బత్తీలను అరటిపండుకు కుచ్చి నిలబెట్టేవాడు.
రెండ్రోజులైనా అదే తిన్నాడు
అయితే, శ్రీశాంత్ నమ్మకాల గురించి తెలిసిన ఓ క్రికెటర్ అతడిని ఆటపట్టించాలని భావించాడు. శ్రీశాంత్.. నువ్వు గనుక ఇప్పటికిప్పుడు అరటిపండు తింటే ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీస్తావు తెలుసా అని ఊరించాడు. అప్పటికే ఆ అగర్‌బత్తీలు పెట్టిన అరటిపండు అక్కడ పెట్టి రెండ్రోజులు అయింది. అయినా శ్రీశాంత్ దానిని తిన్నాడు.
వికెట్లు తీయాలనే కోరికతో అలా చేశాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ గురించి చెప్పుకొచ్చాడు. జియో సినిమా షోలో భాగంగా.. టీమిండియా ఆటగాళ్ల వింత నమ్మకాల గురించి ప్రస్తావన రాగా 2006 నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
అందుకే అలా చేశాడు
కాగా నాడు ఆ అరటిపండు తిన్న శ్రీశాంత్ అప్పటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు వికెట్లు తీశాడు. జమైకాలో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా మొత్తంగా 49 పరుగులు ఇచ్చి ఈ మేరకు వికెట్లు పడగొట్టాడు.
వాళ్లైతే ఆఖరికి లోదుస్తులు కూడా
ఇక ఇదే షోలో పాల్గొన్న టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. భారత క్రికెటర్లలో చాలా మందికి ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. రంజీ ఆడే రోజుల్లో కొంతమంది ఏదైనా ఒకరోజు ఐదు వికెట్లు తీస్తే.. ఆ బట్టలు.. ఆఖరికి లోదుస్తులు కూడా ఉతక్కుండా ఉంచుకునే వాళ్లని తెలిపాడు.
అదృష్టం తమతో పాటు అలాగే అతుక్కుపోవాలని ఇలా చేసే వాళ్లని చెప్పుకొచ్చాడు. శ్రీశాంత్ ఒక్కడికే కాకుండా చాలా మందికి ఇలాంటి నమ్మకాలు ఉంటాయని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా కేరళకు చెందిన శ్రీశాంత్ ప్రస్తుతం జింబాబ్వే ఆఫ్రో టీ10లీగ్‌తో బిజీగా ఉన్నాడు.
చదవండి: ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు!
Comments
Please login to add a commentAdd a comment