PC: IPL.com
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ మతీషా పతిరాన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లతో పతిరాన చెలరేగాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన ఈ యవ పేసర్.. 7.81 ఏకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో పతిరానపై భారత మాజీ పేసర్ శ్రీశాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీఎస్‌కేకు అద్భుతమైన డెత్ ఓవర్లు స్పెషలిస్టు దొరికాడని శ్రీశాంత్ కొనియాడాడు.
"సీఎస్‌కేకు పతిరాన రూపంలో అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ దొరికాడు. అతడు బ్యాటింగ్ కూడా చేయగలిగితే బ్రావోకు ప్రత్యామ్నాయం అవుతాడు. డెత్ ఓవర్లలో వికెట్లు తీసే సత్తా పతిరానకు ఉంది. అతడు యార్కర్లు మాత్రమే కాదు అద్భుతమైన స్లోయర్ బాల్స్ కూడా వేస్తున్నాడు.
చదవండి: IPL 2023: "బేబీ మలింగా" అరుదైన రికార్డు.. తొలి బౌలర్‌గా!
అతడి బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టం. ఒక్క మ్యాచ్‌లోనే కాకుండా ప్రతీ మ్యాచ్‌లో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ధోని సపోర్ట్ అతడికి ఉంది. ధోని ఇటువంటి ఎంతో మంది యువ బౌలర్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు" అంటూ స్టార్‌స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌లో శ్రీశాంత్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: అతడిని బాగా మిస్ అవుతున్నాం.. కానీ తప్పదు! చాలా అరుదుగా ఉంటారు: ధోని
Comments
Please login to add a commentAdd a comment