ఐపీఎల్-2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది. కాగా గుజరాత్ టైటాన్స్‌ను ఓసారి ఛాంపియన్‌గా, మరోసారి రన్నరప్ నిలిపిన హార్దిక్ పాండ్యా.. ముంబైని మాత్రం విజయ పథంలో నడిపించలేకపోతున్నాడు.
రోహిత్ శర్మ స్ధానంలో ముంబై ఇండియన్స్ నూతన సారధిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్.. తన కెప్టెన్సీ మార్క్ చూపించడంలో విఫలమవుతున్నాడు. హార్దిక్ కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరుస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పట్ల ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఆసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
పాండ్యాతో రోహిత్‌కు విభేదాలు ఏర్పడినట్లు సమాచారం. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీరుపై కూడా హిట్‌మ్యాన్ గుర్రుగా ఉన్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీని వీడనున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
న్యూస్24 స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం .. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఐపీఎల్-2025 మెగా వేలంలో పాల్గోవాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు గ్రూపులు వున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కొంత మంది రోహిత్ సపోర్ట్‌కు ఉంటే మరి కొంత మంది హార్దిక్‌కు మద్దుతు పలుకుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment