టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై సారధిగా హార్దిక్ పాండ్యా బరిలోకి దిగాడు. హార్దిక్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఘోర అవమానం ఎదురైంది.
టాస్ సందర్భంగా హార్దిక్ మైదానంలో వచ్చినప్పుడు అభిమానులు రోహిత్ రోహిత్ అంటూ ఎగతాళి చేశారు. కాగా ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను జట్టు కెప్టెన్‌గాముంబై ఇండియన్స్ నియమించిన సంగతి తెలిసిందే. హార్దిక్‌ను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పగ్గాలను ముంబై అప్పగించింది.
ముంబై తీసుకున్న ఈ నిర్ణయాన్ని హిట్‌మ్యాన్ అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో హార్దిక్ ఆటలు ఆడుకున్నాడు. పదేపదే రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్‌ను హార్దిక్ మారుస్తూ అభిమానుల అగ్రహానికి గురయ్యాడు. సాధరణంగా 30 యార్డ్ సర్కిల్‌లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ కన్పించాడు.
గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన గెరాల్డ్ కోయెట్జీ బౌలింగ్‌లో రోహిత్‌ను తొలుత మిడాన్‌లో ఫీల్డింగ్‌లో చేయమని హార్దిక్ ఆదేశించాడు. అయితే బౌలర్‌తో మాట్లాడిన హార్దిక్ వెంటనే రోహిత్‌ను మళ్లీ లాంగ్-ఆన్ పొజిషన్‌కు వెళ్లమని సూచించాడు.
హార్దిక్ ఆర్డర్స్ ఇవ్వడంతో రోహిత్ పరిగెత్తుకుంటూ లాంగ్ ఆన్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హార్దిక్ కావాలనే రోహిత్ ఫీల్డింగ్‌ను పొజిషన్‌ను మార్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
Rohit in 2024 is being treated like Advani in 2014 pic.twitter.com/Ys82JW3svu
— Sagar (@sagarcasm) March 24, 2024
Comments
Please login to add a commentAdd a comment