ఐపీఎల్-2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లకు చాలా కీలకం. ఢిల్లీ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించగా.. ముంబై అయితే ఇంకా బోణే కొట్టలేదు.
దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి గాడిలో పడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ నూతన సారథి హార్దిక్ పాండ్యాకు గంగూలీ మద్దతుగా నిలిచాడు.
ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను ఎవరూ హేళన చేయవద్దని అభిమానులను దాదా కోరాడు. కాగా రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఎంపికైనప్పటి నుంచి అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలో సైతం హార్దిక్‌కు ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. హార్దిక్ ఎక్కడ కన్పించిన రోహిత్ రోహిత్ అంటూ అభిమానులు బోయింగ్ చేస్తున్నారు.
ఈ ఏడాది సీజన్‌లో హార్దిక్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోవడం కూడా అతడి కష్టాలను రెట్టింపు చేసింది. వెంటనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.
"దయచేసి అభిమానులు హార్దిక్ పాండ్యాను బూయింగ్(హేళన) చేయవద్దు. అది కరెక్ట్ కాదు. ముంబై ఫ్రాంచైజీ హార్దిక్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది. అటువంటిప్పుడు అతడేం తప్పు చేశాడు. ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయానికి హార్దిక్‌ను తప్పుబట్టడం సరికాదు.
క్రీడల్లో కెప్టెన్సీ మార్పు సహజం. భారత జట్టుకైనా కావచ్చు ఫ్రాంచైజీలకైనా ఏ ఆటగాడు తన ఇష్టానుసారం కెప్టెన్ కాలేడు. అది మెనెజ్‌మెంట్ నిర్ణయం. రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ఆటగాడు. అతని పెర్ఫార్మెన్స్ వేరే స్ధాయిలో ఉంటుంది.కెప్టెన్‌గా ఒక ఆటగాడిగా రోహిత్ ఒక అద్బుతమని" ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంగూలీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment